Ravela Kishore Babu: వైసీపీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా

AP: ఎన్నికల్లో ఓటమి చెందిన వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జగన్‌కు పంపారు. కాగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రావెల కిషోర్ బాబు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.

Ravela Kishore Babu: వైసీపీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా
New Update

Ravela Kishore Babu: ఎన్నికల్లో ఓటమి చెందిన వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. ప్రజాసేవ చేయడానికి అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రొత్సహించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో సాంఘిక, గిరిజన శాఖ మంత్రిగా సమర్ధవంతంగా పనిచేసి పేద ప్రజలకు సేవ చేసినట్లు తెలిపారు. దురదృష్టవశాత్తూ కొన్ని కారణాల వలన టీడీపీలో కొనసాగలేక పోయానని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం వైసీపీతో సాధ్యమని ఆ పార్టీలో చేరినట్లు తెలిపారు. అయితే జరిగిన ఎన్నికల్లో వైసీపీని ప్రజలు తిరస్కరించారని అన్నారు. సంక్షేమం, సమగ్ర రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని కూటమికి చరిత్రాత్మక విజయం సాధించి పెట్టారని తెలిపారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని విశ్వసిస్తున్నానని అన్నారు. ఒక ప్రక్క సమాజ సేవ చేస్తూ.. మరో పక్క ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేసేందుకు వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.

#ravela-kishore-babu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe