Former Minister Peddireddy: తిరుమలలో విజిలెన్స్ తనిఖీలలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పెత్తనం బయటపడింది. ఒక రోజుకు పదుల సంఖ్యలో సిఫార్సు లేఖలు పంపినట్లు తెలుస్తోంది. 50 మందికి పైగా ప్రోటోకాల్, తోమాల, విఐపీ బ్రేక్, కళ్యాణం జరిపారు. మంత్రి ఆజ్ఞలతో దర్శనాలు కల్పిస్తూ వచ్చారు గత ఈవో ధర్మారెడ్డి.
Also Read: ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఘటనలో మృతులకు రూ.20 లక్షల పరిహారం: రామ్మోహన్ నాయుడు
కాగా, టీటీడీలో స్టేట్ విజిలెన్స్ విభాగం అధికారుల తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. తిరుమల, తిరుపతిల్లోని వివిధ విభాగాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీవారి దర్శనం టికెట్ల కేటాయింపు, శ్రీవాణి ట్రస్టులో అక్రమాలపై ఫిర్యాదుల ఆధారంగా తనీఖీలు నిర్వహిస్తున్నారు.
Also Read: కానిస్టేబుల్ కనుసన్నల్లో ఎర్రచందనం అక్రమ రవాణా..!
అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఇంజినీరింగ్ పనులకు పాలక మండలి రూ.వందల కోట్లు కేటాయించింది. ఆ పనుల్లోనూ భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో టీటీడీలో జరిగిన పనులపై విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.