Former minister Narayana: బాబు షూరిటీ - భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి నారాయణ నెల్లూరు నగరంలోని 16వ డివిజన్‌లో పర్యటించారు. డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని ప్రతీ ఇంటికెళ్లి.. తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తెలియజేశారు. అదే విధంగా 2024లో టీడీపీ - జనసేన పార్టీలకు అండగా నిలవాలని ప్రజల్ని అభ్యర్థించారు.
Also Read: ఏపీలో సర్పంచుల ఆందోళన.. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు..అరెస్ట్ చేసిన పోలీసులు
అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఏ డివిజన్ కి వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. ఎప్పుడైనా ప్రజలు కోరునేది డెవలప్ మెంట్ అని.. ఆ డెవలప్ మెంట్ ని మంత్రిగా తాను పని చేసిన సమయంలో చేసి చూపించానని అన్నారు. ప్రధానంగా దోమలు లేని నగరంగా మార్చేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, ఎన్టీఎన్ రోడ్లు, డ్రింకింగ్ వాటర్ ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టానన్నారు.
Also Read: పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి క్లారిటీ..!
2019లో ఎలక్షన్ కోడ్ రావడం కారణంగా పది శాతం పనులు మాత్రమే మిగిలి పోయాయన్నారు. అయితే వాటిని కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయకుండా అలానే వదిలేయడం దారుణమన్నారు. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా వదిలేసిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అధికారంలోకి రాగానే ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ని పూర్తి చేసి దోమలు లేని నగరంగా మారుస్తానని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. భారతదేశంలోనే నెల్లూరు నగరాన్ని నెం. 1 స్మార్ట్ సిటీగా తీర్చిదిద్డమే తన ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.