స్వల్ప అస్వస్థత
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి శనేశ్వరస్వామి ఆలయం వద్దకు శని త్రయోదశి సందర్భంగా పూజలు నిర్వహించేందుకు వెళ్లారు దగ్గుబాటి.. అయితే, శని దోషం కోసం తైలాభిషేకం చేయిస్తుండగా.. ఆయనకు కళ్లు తిరిగి ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది. ఇక, వెంటనే ఆయనను సన్నిహితులు ఆలయం వద్ద కొద్దిసేపు సేద తీర్పించారు. పూజా కార్యక్రమాలు పూర్తి కాకముందే ఆయన అస్వస్థకు గురయ్యారు. అయితే, కుటుంబసభ్యులు, సన్నిహితులు పూజా కార్యక్రమాలు పూర్తి చేసే వరకు ఆయన అక్కడే కూర్చిండిపోయారు. కాగా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలోనూ అస్వస్థతకు గురయ్యారు.
రాజకీయాలకు దూరంగా..
దగ్గుబాటి వెంకటేశ్వరరావు మరోవైపు రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతున్నట్టు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ మధ్య బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. తాను, తన కుమారుడు హితేష్ చెంచురామ్ ఇద్దరం రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. ఇంకొల్లుతో తనకు ఎంతో అనుబంధం ఉందని, అందుకనే తన మనసులోని మాటను ఇక్కడ బయటపెట్టినట్టు చెప్పారు. ఒకప్పటి రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలకు ఏమాత్రం పొంతన లేదన్న వెంకటేశ్వరరావు.
ఎన్నిసేవలు
అయితే.. డబ్బుతో రాజకీయం, కక్ష సాధింపులకు దిగడం తమ కుటుంబానికి అలవాటు లేదన్నారు. అందుకనే రాజకీయాలకు తాము పూర్తిగా స్వస్తి చెబుతున్నట్టు చెప్పుకొచ్చారు. కాగా, స్వర్గీయ ఎన్టీఆర్ పెద్ద అల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు. పర్చూరు నుంచి అసెంబ్లీకి పలుమార్లు ప్రాతినిధ్యం వహించారు. మంత్రిగా సేవలు అందించారు. అలాగే, లోక్‌సభ, రాజ్యసభకు కూడా ప్రాతినిధ్యం వహించిన ఆయన.. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి పర్చూరు నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు.. ఆయన రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ నిర్ణయం తీసుకోగా.. ఆయన భార్య, కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే.