అసమర్థత ప్రభుత్వం ఇప్పుడే మొద్దు నిద్ర లేచింది: ఆలపాటి

కృష్ణాజలాల పంపిణీ విషయంలో మొన్నటి వరకు నిద్రపోయిన అసమర్థత ప్రభుత్వం..ఇప్పుడే మొద్దు నిద్రలేచిందని ధ్వజమెత్తారు టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్. సాగర్ లో మనకు 13గేట్లు ఉన్నాయని ఇప్పటివరకూ గుర్తుకురాలేదా? అని అధికార పార్టీపై నిప్పులు చెరిగారు.

New Update
అసమర్థత ప్రభుత్వం ఇప్పుడే మొద్దు నిద్ర లేచింది: ఆలపాటి

Former Minister Alapati Rajendraprasad: వైసీపీ ప్రభుత్వంపై మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శలు గుప్పించారు. నాగార్జున సాగర్ లో జలాల విషయంలో రాజకీయం తప్ప రాష్ట్రం కోసం కాదని దుయ్యబట్టారు. నినటి దాకా ఒకరిపై ఒకరు ఆపాయ్యంగా ఉన్న మీరు ఇప్పుడు నీటి కోసం పోరాటం అంటే అర్ధమేంటో జనాలకు తెలుసన్నారు. కృష్ణా జలాలు పంపిణీ విషయంలో ఈరోజు వరకు నిద్రపోయిన అసమర్థత ప్రభుత్వం.. ఇప్పుడే మొద్దు నిద్రలేచిందని ధ్వజమెత్తారు. పంటలు ఎండిపోయిన పరిస్థితుల్లో రైతాంగం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే‌ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: ఆ నియోజకవర్గాల్లో 90 శాతం దాటిన పోలింగ్.. ఎవరికి అనుకూలం?

నాగార్జున సాగర్ లో మనకు 13గేట్లు ఉన్నాయని ఇప్పటివరకూ గుర్తుకురాలేదా? అని వైసీపీ ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించారు. ఒకపక్క నీటి వివాదం చేస్తూనే వివాదం చెయ్యమని మంత్రి అంబటి చెప్పటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దెవ చేశారు. రాష్ట్రంలో 30లక్షల ఎకరాలు నీరు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో కనీసం ఆలోచన లేని అసమర్థత ప్రభుత్వం అని మండిపడ్డారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేక జగన్ ప్రకటనలకు పరిమితమయ్యారని ఫైర్ అయ్యారు. కృష్ణ జలాల పంపిణీ విషయంలో నికర జలాలు కూడా నష్టపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు.

Also read: చలికాలంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి తప్పక పాటించండి..!

Advertisment
తాజా కథనాలు