KCR: తెలంగాణ భవన్ కు మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఆయన కారు నుండి దిగే సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు. సర్జరీ తర్వాత తొలిసారిగా కేసీఆర్ తెలంగాణ భవన్‌కు రావడంతో భవన్ ను ప్రత్యేక అలంకరించారు. పూజారుల ఆశీర్వచనాలతో తన ఛాంబర్‌లోకి వెళ్లారు.
కృష్ణా పరీవాహక ప్రాంత జిల్లాల ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో కేసీఆర్ బేటీ అయ్యారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత విషయంలో బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నల్గొండ వేదికగా కృష్ణా జలాల పరిరక్షణ సభకు ప్లాన్ చేస్తోంది. ఈ అంశంతో పాటు లోక్‌సభ ఎన్నికలు, బడ్జెట్ సమావేశాల విషయమై నేతలకు కేసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
Also Read: పాన్ ఆధార్ లింక్ చేయనివారి నుంచి ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు
ఈ నెల మూడో వారంలో నల్గొండలో కేసీఆర్ భారీ బహిరంగసభకు ప్లాన్ చేస్తున్నారు. కృష్ణా జలాలు, కేఆర్‌ఎంబీ గురించి ప్రజలకు వాస్తవాలను వివరించాలని యోచిస్తున్నారు. ఇనాళ్లు అధికారంలో ఉండిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష్య నేతగా ఎలా వ్యవహరిస్తారనే ఉత్కంఠ నెలకొంది.