Telangana : బీఆర్ఎస్ (BRS) మాజీ మంత్రి మల్లారెడ్డి టీడీపీ (TDP) లోకి వెళ్లబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో చంద్రబాబు (Chandrababu) హయాంలో పనిచేసిన మల్లారెడ్డి మరోసారి టీడీపీ అధికారంలోకి రావడంతో పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరితే తెలంగాణలో టీడీపీ అధ్యక్ష పదవి ఇస్తామంటున్నారని తన అనుచరులు, బీఆర్ఎస్ కౌన్సిలర్లతో మల్లారెడ్డి చర్చలు జరుపుతున్నట్లు సన్నిహిత వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి.
పూర్తిగా చదవండి..Malla Reddy : టీడీపీ వైపు మాజీ మంత్రి మల్లారెడ్డి చూపు.. అధ్యక్ష పదవి కోసం!
బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి టీడీపీ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఇస్తామంటున్నారని తన అనుచరులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. చంద్రబాబు చెబితే రేవంత్ వింటాడని మల్లారెడ్డి ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Translate this News: