Waqf (Amendment) Bill 2024: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు జేపీసీ ఏర్పాటు చేసింది కేంద్రం. 21 మందితో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశారు. త్వరలో రాజ్యసభ నుంచి 10 మంది సభ్యుల పేర్లను త్వరలో ప్రతిపాదించనున్నారు. ఈ కమిటీలో తెలంగాణ నుంచి డీకే అరుణ (DK Aruna), అసదుద్దీన్ (Asaduddin Owaisi).. ఏపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలుకు (Lavu Sri Krishna Devarayalu) స్థానం దక్కింది.
ఈ బిల్లుకు వైసీపీ వ్యతిరేకం..
బీజేపీకి వైసీపీ బిగ్ షాక్ ఇచ్చింది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకిస్తూ ప్రకటన చేసింది. నిన్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును మోదీ సర్కార్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు టీడీపీ, జేడీయూ సహా ఎన్డీయే మిత్రపక్షాలు మద్దతు ప్రకటించాయి. కానీ, విపక్షాలు మాత్రం బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి.
అయితే, ఈ బిల్లుపై వైసీపీ లోక్ సభ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. బిల్లును ప్రవేశపెట్టే ముందు ముస్లింల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన అభిప్రాయాలకు తాము ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. మోదీ సర్కార్ కేంద్రంలో అధికారంలో వచ్చిన నాటి నుంచి వైసీపీ దాదాపు ప్రతి అంశంలోనూ మద్దతు ఇస్తూ వచ్చింది. అనేక బిల్లులకు అనుకూలంగా ఓటు వేసింది. తాజాగా లోక్ సభ స్పీకర్ ఎన్నికకు కూడా వైసీపీ సహకరించింది. కానీ.. ఊహించాని విధంగా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకించడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వైసీపీ ఇండియా కూటమిలో చేరుతుందమనే ప్రచారానికి బలం చేకూరింది.
Also Read: ఏపీలో భారీగా పట్టుబడిన అక్రమ మద్యం.. రూ. 36 లక్షలు నేలపాలు!