Kavitha Was Given Injections: సార్వత్రిక ఎన్నికలకు ముందు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Scam Case) దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో కేసీఆర్ కుమార్తే, బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవ్వడం సంచలనం రేపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ED) కుట్రపూరితంగా తనను అరెస్ట్ చేసిందని కవిత చెబుతుండగా.. విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్నమని దర్యాప్తు సంస్థ వాదిస్తోంది. ఈ కేసు విషయం ప్రస్తుతం కోర్టుల పరిధిలో ఉండగా.. కవిత లాయర్ చేసిన ఓ ప్రకటన షాక్‌కు గురి చేసింది. కవితకు బలవంతంగా ఇంజక్షన్లు పొడిచారని కవిత లాయర్ చెబుతున్నారు. కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టులో ఈ వ్యాఖ్యలు చేశారు. కవితకు బీపీ ఎక్కువగా (High BP) ఉందని, గుండె కొట్టుకునే వేగం సరిగా లేదని చెప్పారు. తెల్లవారుజామున 3 గంటలకు కవితకు బలవంతంగా ఇంజక్షన్ వేశారన్నారు లాయర్.
ఈ అరెస్టు బాధాకరమని కవిత తరపు న్యాయవాది అన్నారు. అరెస్టు చేయబోమని హామీ ఇచ్చారని కానీ అరెస్ట్ చేశారనన్నారు. కవితతో మాట్లాడేందుకు సమయం కావాలని లాయర్ కోరారు. కోర్టులో ఆమెతో మాట్లాడేందుకు కవిత తరఫు లాయర్లను కోర్టు అనుమతించింది. కవిత అరెస్టుపై లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అరెస్టు అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనన్నారు. మరోవైపు తన అరెస్ట్ చట్టవిరుద్ధమని.. తనకు ఆరోగ్యం సరిగా లేదని కవిత చెబుతోంది.
కవిత పాత్ర ఏంటి?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె అయిన కవితకు అనేక వ్యాపారాల్లో భాగస్వామ్యం ఉంది. అందులో 'సౌత్ గ్రూప్' (South Group) ఒకటి. ఈ గ్రూప్‌ని కంట్రోల్ చేసే వారిలో వారిలో కవిత ఒకరు. ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీ రూపకల్పనలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులకు అనుకూలంగా వ్యవహరించినందుకు ఆప్ ప్రతినిధి విజయ్ నాయర్‌కు కవితకు చెందిన సౌత్ గ్రూప్ రూ.100 కోట్లు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read: మోగిన ఎన్నికల నగారా.. ఎలక్షన్ షెడ్యూల్ అవుట్.. తేదీలివే!