Health Tips : ఇవి రెండు కాడలు చాలు..దెబ్బకు కఫం పరార్..దగ్గు, జలుబు సమస్యే ఉండదు..!!

చలికాలంలో కఫం, జలుబు, దగ్గు సమస్యలు వేధిస్తుంటాయి. వీటిని బయటపడాలంటే సహజ పద్దతులను పాటించాలి. తిప్పతీగ కాడలతో కషాయం చేసుకుని తాగుతే జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలు దూరం అవుతాయి. శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

New Update
Health Tips : ఇవి రెండు కాడలు చాలు..దెబ్బకు కఫం పరార్..దగ్గు, జలుబు సమస్యే ఉండదు..!!

చలికాలంలో ఎన్నో వ్యాధులకు తీసుకువస్తుంది. ఈ కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆస్తమా పేషంట్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మనకు ఈజీగా లభించే కొన్ని పదార్థాలతో ఒక డ్రింక్ ను తయారు చేసుకుని తాగుతే దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యలు దూరం అవుతాయి. వాతావరణ మార్పుల కారణంగా ఇలాంటి సమ్యలు తలెత్తుతాయి. మనలో చాలా మంది యాంటీ బయాటిక్ లను వాడుతుంటారు. కానీ ఇలా యాంటీ బయాటిక్స్ ను వాడటం వల్ల భవిష్యత్తులో అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొవల్సి వస్తుంది. కాబట్టి సహాజ సిద్ధమైన పద్దతుల ద్వారా ఈ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి.

జలుబు, దగ్గు వంటి సమస్యలు వేధిస్తున్నప్పుడు ఈ కషాన్ని తయారు చేసి తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ కషాయాన్ని తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అంతేకాదు శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. వాతావరణ మార్పుల వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గించే ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కషాయం తయారీ విధానం:
ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసి వేడి చేయండి. ఇందులో ఐదు చిన్న తిప్ప తీగ కాడలు, ఒక తిప్పతీగ ఆకు, 10 తులసి ఆకులు, నాలుగు దంచిన మిరియాలు, చిటికెడు పసుపు, చిన్న అల్లం ముక్క వేసి బాగా మరిగించాలి. దాదాపు 7 నిమిషాలు మరిగించండి. తర్వాత ఈ కషాయాన్ని వడకట్టి గ్లాసులో పోసుకోండి. ఇందులో తగినంత తేనె కూడా వేసుకోని గోరు వెచ్చగా తాగాలి.

ఇలా వారంలో 3 సార్లు తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఛాతిలో కఫం కూడా తొలగిపోతుంది. శరీరంలో ఇమ్యూనిటీ పెరిగి ఇన్ఫెక్షన్ లు దరి చేరకుండా ఉంటాయి. అయితే షుగర్ తో బాధపడేవారు తేనె వేసుకోకపోవడమే మంచిది. జలుబు, దగ్గు వంటి సమ్యలు వేధించినప్పుడు తరచుగా యాంటీ బయాటిక్ ల మీద ఆధారపడకుండా ఇలా చాలా సులభంగా మనకు లభించే సహజ సిద్ధ పదార్థాలతో కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఈ 5 అలవాట్లు మిమ్మల్ని రోజంతా యాక్టివ్ గా ఉంచుతాయి..అలసటను దూరం చేస్తాయి…!!

Advertisment
Advertisment
తాజా కథనాలు