Relationship: శృంగారం తర్వాత అలిసిపోతున్నారా? ఇలా చేస్తే స్టామినా రెట్టింపవుతుంది!

శృంగారం తర్వాత ఎక్కువగా అలిసిపోకుండా ఉండాలంటే లైఫ్‌స్టైల్‌లో కొన్ని ఆహారాలు చేర్చుకోవడం తప్పనిసరి. బాదం, వాల్ నట్స్, నట్స్, వేరుశెనగ, డార్క్ చాక్లెట్, దానిమ్మ, ఇతర పండ్లను డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది. వీటిని బ్యాలెన్సడ్‌ తింటే సెక్సువల్‌ స్టామినా కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతుంటారు.

Relationship: శృంగారం తర్వాత అలిసిపోతున్నారా? ఇలా చేస్తే స్టామినా రెట్టింపవుతుంది!
New Update

Love Making Tips and Foods: జీవితంలో ఎన్ని అనుభవాలు ఉన్నా ప్రియురాలితో గడిపే ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేం. ఇక పెళ్లి తర్వాత ఎవరైనా ముందుగా చేసేది శృంగారమే. మూడు ముళ్లు పడిన రాత్రి దూరాలు దగ్గరవుతాయి. ఆగలేని మొహాలు చేరి పెదవులు వణుకుతాయి. ఇలా శృంగారం దంపతులను దగ్గర చేస్తుంది. అది జీవితంలో భాగమైపోతుంది. అయితే చాలామందికి శృంగారం తర్వాత అలసట వస్తుంది. ఇది కొన్నిసార్లు తీవ్రంగా మారుతుంది. చాలామందికి ఈ సమస్య ఉంటుందని డాక్టర్లు చెబుతుంటారు. ఇది సాధారణ విషయమేనని డాక్టర్లు అంటారు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే శృంగారం తర్వాత అలిసిపోకుండా ఉండొచ్చట.. ముఖ్యంగా కొన్ని ఆహారపదార్థాలు శృంగారం తర్వాత అలిసిపోకుండా చేస్తాయట.. అవేంటో తెలుసుకోండి!

డ్రై ఫ్రూట్స్:

బాదం, వాల్ నట్స్, నట్స్, వేరుశెనగ, హాజెల్ నట్స్ లాంటి ఆహారాలలో జింక్‌, అగ్రినిన్ అధికంగా ఉంటాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అందుదే డ్రై ఫ్రూట్స్‌ తినడం వల్ల వీర్యకణాల నాణ్యత బెటర్‌ అవుతుంది . ఇది పురుషుల సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. డ్రై ఫ్రుట్స్‌ బ్యాలెన్స్‌గా తినేవారు శృంగారం తర్వాత తక్కువ అలిసిపోతారని డాక్టర్లు చెబుతుంటారు.

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. 60 శాతం కోకోతో తయారు చేసిన డార్క్ చాక్లెట్ తినండి. ఇది శృంగారానికి గొప్ప బూస్ట్‌. డార్క్‌ చాక్లెట్‌ లైంగిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

పండ్లు:

పండ్లు పుష్కలంగా తినడం వల్ల అంగస్తంభన ప్రమాదం 14 శాతం తగ్గుతుంది. పండులో ఉండే ఫ్లేవనాయిడ్ దీనికి కారణం కావచ్చు. పర్పుల్, ద్రాక్ష, ఆపిల్, పుల్లని పండ్లలో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది లిబిడోను పెంచుతుంది. లిబిడో కరెక్ట్‌గా ఉంటే శృంగారం హ్యాపీగా సాగుతుంది. అప్పుడు అలిసిపోయే ప్రమాదం తగ్గినట్టే. ఇక పండ్లలను ఎక్కువగా తింటే సెక్సువల్‌ స్టామినా కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతుంటారు.

దానిమ్మ:

దానిమ్మ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలో రక్తప్రసరణ బాగా జరగాలంటే మహిళలు కూడా దానిమ్మ తినవచ్చు. ఇది అలసటకు చెక్‌ పెట్టే ఒక మంచి ఫ్రూట్‌.

గమనిక:

ఈ ఆర్టికల్‌ ఇంటర్‌నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చాం. ఆరోగ్య, లైంగిక సమస్యల కోసం సంబంధిత వైద్య నిపుణుడికి కలవండి.

Also Read: ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్లని అసలు వదులుకోకూడదు.. నిజమైన లవర్స్‌ ఎలా ఉంటారంటే?

#health-tips #life-style
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe