Diarrhea: ఈ ఆహారాలతో డయేరియాకు.. చెక్ పెట్టండి

విరోచనాలు అయినప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని చాలా మంది భయపడుతుంటారు. ఇలాంటి సమయంలో లైట్ ఫుడ్స్ ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఓట్స్, ఉప్పు నీరు, మునగాకు జ్యూస్, బననా, అల్లం టీ విరోచనాల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే ఫ్లూయిడ్స్ కూడా ఎక్కువగా తాగాలి.

New Update
Diarrhea: ఈ ఆహారాలతో డయేరియాకు.. చెక్ పెట్టండి

Diarrhea: సాధారణంగా విరోచనాలు.. ఫుడ్ ఎలర్జీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అపరిశుభ్రమైన పరిసరాల్లోని ఆహారాలు తిన్నప్పుడు, లేదా జీర్ణక్రియ సమస్యల కారణంగా వస్తాయి. కొన్ని సార్లు విరోచనాలతో పాటు విపరీతమైన వాంతులు కూడా అవుతావు. వీటి వల్ల శరీరం బాగా డీహైడ్రేట్ అయిపోయి నీరసానికి దారితీస్తుంది. ఇలాంటి సమయంలో తినే ఆహారాల పట్ల శ్రద్దగా ఉండాలి. విరోచనాలు అయినప్పుడు చాలా మందికి ఎదురయ్యే సమస్య ఇదే. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి. ఈ కింది ఆహారాలు తీసుకుంటే మోషన్స్ నుంచి ఉపశమనం కలుగుతుంది.

అల్లం టీ

కడుపులో వికారం, కడుపు నొప్పిగా ఉన్నప్పుడు అల్లం టీ తాగితే అద్భుతంగా పని చేస్తుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కడుపును శుభ్రం చేసి.. స్టొమక్ అప్ సెట్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అల్లం టీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

అరటి పండు

లూస్ మోషన్స్ సమయంలో అరటిపండు బాగా ఉపయోగపడుతుంది. దీనిలోని హై పెక్టిన్ కంటెంట్ పేగుల్లోని అధిక నీటిని పీల్చుకొని మలం గట్టిగా మారడానికి సహాయపడుతుంది. అలాగే వీటిలోని నేచురల్ యాంటీ ఆక్షిడెంట్స్, పొటాషియం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Also Read: Cholesterol Friendly Veggies: అధిక కొలెస్ట్రాల్ కు.. ఈ కూరగాయలతో చెక్ పెట్టండి

publive-image

ఓట్స్

విరోచనాలు అయినప్పుడు ఓట్స్ తినడం మంచిది. వీటిలోని సోలబుల్ ఫైబర్ లూస్ మోషన్స్ కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే డైజెషన్ ప్రక్రియను కూడా నెమ్మదిగా చేసి విరోచనాలను కంట్రోల్ చేస్తుంది.

ఉప్పు నీరు

మోషన్స్ సమయంలో శరీరం నుంచి చాలా నీటిని కోల్పోతారు. దీని కారణంగా బాడీ డీహైడ్రేట్ అవుతుంది. అందుకే ఉప్పు నీరు లేదా, షుగర్ వాటర్, ఫ్లూయిడ్స్ తీసుకుంటే నీరసంతో పాటు సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

మునగాకు జ్యూస్

మునగాకు శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇవి మలబద్దకం, విరోచనాలు వంటి సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా మోషన్స్ సమయంలో వీటి జ్యూస్ తాగితే మంచిది. సమస్యను కొంత వరకు తగ్గిస్తుంది.

గమనిక:  కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Rose Day: లవర్స్ కి ప్రపోజ్ టైం లో గులాబీ పువ్వునే ఎందుకు ఇస్తారు?

Advertisment
తాజా కథనాలు