Food Habits: పొరపాటున పాలతో వీటిని కలిపి తిన్నారో.. మీ పని అంతే..! సహజంగా పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ ఆయుర్వేదం ప్రకారం పాలను కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తింటే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సిట్రస్ పండ్లు, జాక్‌ఫ్రూట్, చేప, ముల్లంగి, ఉప్పు వంటి ఆహారాలను పాలతో కలిపి తినకూడదు. By Archana 18 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Foods to Avoid Consuming With Milk: పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. వీటిలో శరీరానికి కావాల్సిన సోడియం, పొటాషియం, ఫైబర్, కాల్షియం, ప్రోటీన్, ఐరన్ మరియు విటమిన్ సి (Vitamin C) వంటి పుష్కలమైన పోషకాలు ఉంటాయి. రోజూ వారి ఆహారంలో వీటిని తీసుకోవడం ఎముకల దృఢత్వం, జీర్ణక్రియ ఆరోగ్యానికి సహాయపడతాయి. పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం కానీ ఈ 5 ఆహారాలతో పాలను కలిపి తీసుకోవడం లేదా తాగిన వెంటనే వీటిని తినడం ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. పాలు తాగిన తర్వాత ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి సిట్రస్ పండ్లు నిమ్మకాయ , సిట్రస్ పండ్లను పాలు తాగిన వెంటనే తినకూడదు. ఇలా చేయడం ద్వారా గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు పెరుగుతాయి. అంతే కాదు పాలు తాగిన తర్వాత పుల్లటి పండ్లను తీసుకోవడం వల్ల పాలలోని క్యాల్షియం శరీరానికి అందదు. పుల్లని పండ్లు దానిలోని పోషకాలను పీల్చుకుంటాయి. జాక్‌ఫ్రూట్ పాలు తాగిన తర్వాత జాక్‌ఫ్రూట్ తీసుకోవడం మానుకోవాలి. పాలు తాగిన తర్వాత జాక్‌ఫ్రూట్ తినడం జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. ఇది అనేక కడుపు సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. అంతే కాదు ఈ ఫుడ్ కాంబినేషన్ దద్దుర్లు, దురదలు , సోరియాసిస్ వంటి చర్మ సంబంధిత సమస్యలను రెట్టింపు చేస్తుంది. చేప ఆయుర్వేదం ప్రకారం, చేపలు, పాలు కలిపి తినడం వల్ల శరీరంపై వివిధ ప్రభావాలు ఉంటాయి. పాలు చలువను , చేపలు వేడిని కలిగి ఉంటాయి ఉంటాయి. ఈ రెండింటినీ కలయిక కారణంగా శరీరంలో అసమతుల్యత ఏర్పడి..రసాయన మార్పులకు కారణమవుతుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తులు చేపలు, పాలు కలయికకు దూరంగా ఉండాలి. ముల్లంగి ముల్లంగిని పాలతో కలిపి తినడం లేదా ముల్లంగి తిన్న వెంటనే పాలు తాగడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఇలా చేయడం గుండెల్లో మంట, ఎసిడిటీ, కడుపునొప్పి సమస్యలకు దారి తీస్తుంది. ఈ రెండు పదార్థాలను తీసుకోవడానికి మధ్య కొన్ని గంటల గ్యాప్ ఉండాలని నిపుణుల సూచన. ఉప్పు పాలు తాగిన తర్వాత ఉప్పుతో కూడిన ఆహారాలను తినకుండా ఉండాలి. సమోసా, పరాటా, కిచిడీ వంటి వాటిని పాలతో కలిపి తినకూడదు. ఉప్పుతో కూడిన పాలను తీసుకోవడం వల్ల సోడియం , లాక్టోస్ మధ్య ప్రతిచర్య ఏర్పడుతుంది. ఇది మీ రక్తపోటును పెంచి.. గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: బ్లాక్ హెడ్స్‌తో బాధపడుతున్నా?.. సింపుల్‌గా తొలగించుకోండి Also Read: Glows Skin: దానిమ్మతో మెరిసే చర్మాన్ని పొందండి..మొటిమలు సైతం మాయం #fish #food-habits #milk మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి