దీపావళి రోజున లక్ష్మీ పూజ నిర్వహిస్తారు. సాయంత్రం అమ్మవారికి పూజ నిర్వహించి దీపాలు వెలిగించి టపాసులు కాల్చుతారు. అయితే ఈ లక్ష్మీ పూజకు కొన్ని నియమాలు ఉన్నాయి. లక్ష్మీ పూజ నిర్వహించిన తరువాత పెరుగు, సింధూరం, రావిచెట్టు మొదట్లో ఉంచి అక్కడ దీపం వెలిగించాలి. దీని వల్ల ఆదాయం పెరగడంతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.
దీపావళి పూజ చేసిన తరువాత శంఖనాదం వినిపించాలి. ఇలా చేయడం వల్ల దరిద్రం తొలగిపోతుందని ఓ నమ్మకం. ఇంట్లో ఎప్పుడూ లక్ష్మి దేవి నివాసం ఉంటుంది.దీపావళి రోజూ రాత్రి గుడ్లగూబ చిత్రాన్ని లాకర్ పై అతికించాలి. గుడ్లగూబ బొమ్మ గుమ్మం పైన ఉంచితే అక్కడ లక్ష్మి నివాసిస్తుందని ప్రజలు విశ్వసిస్తారు.
అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు గోమతీ చక్రాన్నిప్లేట్ లో ఉంచాలి. లక్ష్మీ పూజ తర్వాత గోమతీ చక్రపూజ చేయాలి.తర్వాత గోమతీ చక్రాన్ని అరలో ఉంచుకోవాలి. దీంతో సంపద పెరుగుతోంది. దీపావళి పూజ చేస్తున్నప్పుడు లక్ష్మీ గణేశ యంత్రాన్ని కూడా పూజించవచ్చు. అలాగే శ్రీ యంత్రానికి, కుబేర యంత్రానికి కూడా పూజలు నిర్వహించాలి.
దీని వల్ల ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బు సమస్య ఉండదు. దీపావళి లక్ష్మీ పూజ సమయంలో అమ్మవారికి 11 పసుపు గవ్వలను సమర్పించాలి. పూజ చేసిన తరువాత ఈ గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి, అల్మారాలో భద్రంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది.
దీపావళి రోజున అమ్మవారి గుడిలో లక్ష్మీదేవికి ఎర్రటి చీర సమర్పించాలి. తమలపాకు పై కుంకుమ పెట్టి దాని పై లడ్డూలు పెట్టి ఆంజనేయునికి నైవేద్యంగా సమర్పిస్తే మంచి జరుగుతుంది. ఇది ఆదాయ అడ్డంకిని తొలగిస్తుంది. అర్థరాత్రి లక్ష్మీపూజ చేసిన తరువాత ఇంట్లో కచ్చితంగా గంట మోగించాలి.
ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల పరిస్థితులు అన్ని కూడా దూరం అవుతాయి. లక్ష్మీ పూజ సమయంలో మీరు వెండి పాత్రను ఉపయోగించాలి. వెండి గిన్నెలో కర్పూరంతో హారతి చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది.
Also read: దీపావళి నాడు తప్పక పాటించాల్సిన ఆచారాలు ఇవే: చాగంటి కోటేశ్వరరావు