First Salary: ఫస్ట్ సాలరీ వచ్చిందా? ఇలా చేస్తే ఎప్పుడూ డబ్బు ఇబ్బంది ఉండదు.. 

New Update
First Salary: ఫస్ట్ సాలరీ వచ్చిందా? ఇలా చేస్తే ఎప్పుడూ డబ్బు ఇబ్బంది ఉండదు.. 

First Salary: చదువు పూర్తి చేసి కొత్తగా ఉద్యోగంలో చేరితే వచ్చే మజా భలే ఉంటుంది. ఆ తరువాత మొదటి నెల జీతం అందుకోగానే మనసు గాలిలో తేలినట్టుందే.. అని పాట పాడేసుకుంటుంది. తొలిసారిగా కష్టపడి సంపాదించిన డబ్బు.. చేతిలో పడగానే అప్పటివరకూ తీరకుండా ఉండిపోయిన కోరికలన్నీ ఒక్కసారిగా రెక్కలు విప్పుకుని మన కళ్ళముందు చక్కర్లు కొట్టేస్తాయి. మరోపక్క పార్టీల కోసం స్నేహితులు చేసే హడావుడి ఎటూ ఆలోచించని స్థితికి చేర్చేస్తుంది. మొదటి జీతం(First Salary) అందుకున్న తరువాత ఒక్క పది నిమిషాలు ఆలోచించండి. మీరు ఆ డబ్బు సంపాదించడానికి నెల రోజుల పాటు ఎంత కష్టపడ్డారు? అవును.. ఒక్కసారి ఆ కష్టం గుర్తు తెచ్చుకుంటే.. ప్రతినెలా ఎంత కష్టపడితే ఆ జీతాన్ని సంపాదించగలరో ఆలోచిస్తే అప్పుడు మీకు మీ జీతాన్ని సరైన పద్ధతిలో ఎలా ఖర్చు పెట్టాలి అనే ఆలోచన మొదలవుతుంది. మీ ఆలోచనలకూ తోడుగా ఉండేందుకు ఇదిగో ఇక్కడ కొన్ని టిప్స్ అందిస్తున్నాం. వాటిని పాటించండి. భవిష్యత్ లో మీ తల్లిదండ్రుల్లా.. మీ ఇరుగూ పొరుగులా డబ్బు కోసం ఇబ్బంది పడే పరిస్థితులు తెచ్చుకోకుండా చిరునవ్వుతో జీవితాన్ని కొనసాగించేయగలుగుతారు. 

మొదటిసారిగా కష్టపడి డబ్బు సంపాదించిన ఈ కొత్త దశతో, ముందున్న బాధ్యతల కోసం కూడా ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాలి.

బడ్జెట్.. 

అందరి పరిస్థితి వేరు. కొందరికి మొత్తం కుటుంబ బాధ్యత ఉంటుంది, మరికొందరు తమ లక్ష్యాలను చేరుకోవడానికి చొరవ తీసుకుంటారు. అందువల్ల, ఈ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని, జీతం వినియోగానికి బడ్జెట్‌ను(First Salary) రూపొందించండి. మీరు ఇంటి నుంచి దూరంగా ఉంటున్నట్లయితే, మీరు జీవించడానికి అయ్యే ఖర్చులు,  వ్యక్తిగత అవసరాలు మొదలైనవాటిని బడ్జెట్ లో స్పష్టంగా చేర్చండి. కుటుంబ ఆర్థిక సహాయానికి ఎంత ఇవ్వాలో కేటాయించండి. వీటితో పాటు కచ్చితంగా కొంత మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ లేదా సేవింగ్స్ కోసం కేటాయించండి. 

ఇన్వెస్ట్మెంట్స్.. సేవింగ్స్.. 

మొదటి నుంచే పొదుపు చేయడం- పెట్టుబడి పెట్టడం ప్రారంభించడం తెలివైన పని. సాధారణంగా, ప్రాథమిక ఖర్చులు(First Salary) ప్రారంభంలో తక్కువగా ఉంటాయి. తరువాత తరువాత పెళ్లి.. పిల్లలు  ఇలా బాధ్యతలు మీద పడతాయి. ఖర్చులు పెరుగుతాయి. అందుకే జీతం అందుకోవడం మొదలు పెట్టినప్పుడే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ పై దృష్టి పెట్టడం చాలా అవసరం. ఇందుకోసం 50-30-20 పెట్టుబడి నియమాన్ని అనుసరించే బదులు, 40-40-20 విధానం అనుసరించండి. అంటే 40 శాతం మీ ప్రాధమిక అవసరాలు.. 40 శాతం మీ సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ మిగిలిన 20 శాతం మీ కోరికలు తీర్చుకోవడానికి ఖర్చు చేసుకోండి. 

ఇదంత సులభం కాదు. మనకు ఏమి కావాలో తెలుసుకోవడం ముఖ్యం. జీవిత లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇంకా, మన ప్రాధాన్యతలు కాలానుగుణంగా మారినప్పటికీ, మన పెట్టుబడులు ఇంకా వృద్ధి చెందుతాయి.  ఆ లక్ష్యాలను అందుకోగలుగుతాము. మన పెట్టుబడి మనకు అదనపు ఆదాయాన్ని అందజేస్తుంది.

Also Read:  బేసిక్ సేవింగ్స్ ఎకౌంట్.. మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు.. వివరాలివే 

ఇన్సూరెన్స్ లో.. 

మీరు సంపాదన(First Salary) ప్రారంభంలోనే ఇన్సూరెన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్  ప్రీమియం తక్కువగా ఉంటుంది.  వీలైనంత వరకు లైఫ్ ఇన్సూరెన్స్ - హెల్త్ ఇన్సూరెన్స్ పొందడంలో ఆలస్యం చేయకూడదు. దీంతో భవిష్యత్తుకు భద్రత కల్పించవచ్చు.

SIP కూడా ఒక ఆప్షన్ 

పొదుపు కోసం, మొదటి నుంచి(First Salary)  బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ ఖాతాను తెరవడం అలాగే, మ్యూచువల్ ఫండ్‌లలో SIP ద్వారా ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేయడం మంచి ఎంపిక. అలాగే, మీ వార్షిక ఆదాయంపై చెల్లించాల్సిన పన్ను ప్రకారం పన్ను ఆదా చేయడాని ఆప్షన్స్ ఉన్నాయి.

తెలివిగా ఖర్చు చేయండి 

మీరు అనవసరంగా ఖర్చు చేయనప్పుడు మాత్రమే డబ్బు ఆదా(First Salary) అవుతుంది. మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు మొదలైన చాలా ఖరీదైన గాడ్జెట్‌లపై ఖర్చు చేయడం, క్రెడిట్ కార్డ్‌లు తీసుకోవడం లేదా ప్రతి వారం వినోదం కోసం డబ్బు ఖర్చు చేయడం మొదలైనవి అన్నీ అనవసరమైన ఖర్చులుగా చెప్పవచ్చు. అలా అని కోర్కెలు చంపేసుకోమని చెప్పడం కాదు. దానికి కేటాయించిన బడ్జెట్ మించకుండా ఖర్చు చేస్తే చాలు. 

పోలికల పరుగులు వద్దు.. 

First Salary: మనం ఆఫీసులో వివిధ రకాల వ్యక్తులను మొదటిసారి కలిసినప్పుడు, మనం ఇతరులతో పోల్చుకోవడం ప్రారంభిస్తాము. చాలా సార్లు చాలా ఖరీదైన బట్టలు కొనడం అలాగే ఇతరులతో పోటీ పడడం, ఖరీదైన హోటళ్లలో తినడం.. ఇతరులకు పార్టీలు ఇవ్వడం మొదలైన ఖర్చులకు దూరంగా ఉండాలి. మీ పక్కన ఉన్నవారిలా ఉండాలి అనుకుంటే కనుక ముందు మీరు పొదుపు, పెట్టుబడి అవసరాలు పూర్తి చేయండి. తరువాత మిగిలిన సొమ్ముతో మీరు అలా ఉండే ప్రయత్నం చేయవచ్చు. 

సరైన ఆర్ధిక ప్రణాళిక.. దానిని కచ్చితంగా అమలు చేసే సంకల్పం మిమ్మల్ని ఇతరులకన్నా మెరుగైన స్థితిలోకి కచ్చితంగా తీసుకు వెళుతుంది. 

Advertisment
తాజా కథనాలు