Flood Water : సాధారణంగా ఈత నేర్చుకోవాలంటే... పట్టణాల్లో ఉండే వారు స్విమ్మింగ్ పూల్స్ (Swimming Pools) కి వెళ్తారు. కొంచెం గ్రామీణ ప్రాంతాల వారు అయితే కాలువలు, చెరువుల్లో నేర్చుకుంటుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. ఏం చక్కగా నీరే మన దగ్గరకే వస్తే.. ఇక ఆగుతామా..పెద్దవారికే ఎంతో సరదాగా ఉంటుంది. అదే చిన్నపిల్లలు అయితే ఇక వారి ఆనందానికి అవధులే ఉండవు.
ఏకంగా తరగతి గదులే ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల (Rains) వల్ల చాలా ప్రదేశాలు నీట మునిగాయి. అలా ఓ పాఠశాల తరగతి గదుల్లోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. కానీ పాఠశాల యజమాన్యం మాత్రం సెలవులు ప్రకటించకుండా తరగతులు నిర్వహించారు.
కానీ క్లాసుల్లోకి వరదనీరు చేరడంతో పిల్లలంతా సరదాగా నీటిలో ఈత కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన కొందరు ఫన్నీ కామెంట్లు పెడుతుంటే..కొందరు మాత్రం పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : విజయ్ లుక్ చూస్తే షాకే..! ‘VD12’ ఫస్ట్ లుక్ పోస్టర్