East Godavari: అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో పునరావాస కేంద్రంలో వరద నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ సంవత్సరం వచ్చే వరదలకు తాము ఇబ్బందులు గురవుతున్నామని.. ప్రతీ ఏడాది ఇలా తమ సొంత ఇల్లు వదిలిపెట్టి ఇలా పునరావాస కేంద్రాల్లో ఉండటం చాలా బాధాకరంగా ఉందని వాపోయారు.
ఈ వరదల వలన తమ ఉపాధి పోవడంతో పాటు ఇళ్ళు కూడా కూలిపోయే పరిస్థితి వస్తోందని, ప్రభుతం నుండి ఎలాంటి సహాయ సహకారాలు ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం వచ్చే ఏడాదికైనా తమకు పునరావాసానికి ఇళ్ళు ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు రావలసిన R&R ప్యాకేజీ ఇచ్చి మమ్మలను ఇక్కడ నుంచి ఏదో ఒక ప్రాంతానికి తరలించాలని ముఖ్య మంత్రి చంద్రబాబుని బాధితులు వేడుకుంటున్నారు.
Also Read: పట్టాలెక్కిన రాజధాని నిర్మాణం.. అమరావతి వెనుక ఎన్నో వివాదాలు, పోరాటాలు