Alluri District: మన్యం ప్రాంతంలో కొనసాగుతున్న వరద తీవ్రత

అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వరద వల్ల అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వరద సహాయ చర్యలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం తోపాటు.. సహాయక చర్యలు పటిష్టంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలు వరద నీరు వల్ల బయటకు రావద్దని వాతావరణ అధికారులు వెల్లడించారు. మరో 3 మూడు రోజులు భారీ వర్షాలు ఇలానే ఉంటాయని తెలిపారు.

New Update
Alluri District: మన్యం ప్రాంతంలో కొనసాగుతున్న వరద తీవ్రత

Flood intensity in Manyam region

ఏపీలో నాలుగైదు రోజులుగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా వరద ఉధృతం కొనసాగుతనే ఉంది. దీంతో మన్యం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, తాగునీరు లేక అలమటిస్తున్నారు. ఉన్నతాధికారులతో కలిసి గత ఐదు రోజులుగా వరద ముంపు గ్రామాల్లోనే పర్యటిస్తూ ముంపు ప్రాంతాల ప్రజలను పరామర్శిస్తూ, వారికి సహాయం అందేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

కొనసాగుతున్న వరద

అల్లూరి జిల్లాలోని రంపచోడవరం ఏజెన్సీ వరద బీభత్సం ఇంకా అలానే ఉంది. మన్యం ప్రాంతంలో వరద తీవ్రత కొనసాగుతునే ఉంది. అయితే కొన్ని రోజులుగా మన్యంలో ఎడతెరిపి లేకుండా కురిసిన్న వర్షాలకు జలాశయాలన్ని నిండుకుండలా మరాయి. అంతేకాకుండా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో భూపతిపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్ట్‌లకు భారీగా వరద నీరు చేరుతుంది. భూపతిపాలెం రిజర్వాయర్ వద్ద వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే రెండు గేట్లు ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. మన్యంలో సితపల్లి వాగు, పాములేరు వాగు, సోకులేరు, జడేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్ సహాయక చర్యలు..

మన్యంలో ఎక్కువగా వరద ప్రవాహం ఉన్నందున ఆయా గ్రామాలలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటు చేసి, ప్రజలను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో కలెక్టర్‌తో పాటు అధికారులు పర్యటించి ముంపు ప్రాంతాలు పరిశీలించటంతో పాటు కొన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలులో చెపట్టేరు. వరద ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా అన్ని రకాల సహాయక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముందుగా వారిని శిబిరాలకు తరలించి వైద్య సహాయం అందించామని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

వరద ప్రమాద హెచ్చరికలు జారీ

ముంపునకు గురైన బాధితులందరికీ నిత్యవసర వస్తువులైన బియ్యం, పప్పులతో పాటు ఉల్లిపాయలు, నూనె, మంచినీటి సదుపాయం కల్పించారు. కొండపైనున్న వారికి టార్పాలిన్స్ ఏర్పాటు చేశారు. వరదలు తగ్గుముఖం పట్టేవరకు వరద బాధితులు అందరికీ సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. మన్యం మండలాలలోని గ్రామాలలో వరద సహాయ చర్యల్లో భాగంగా ప్రతి మండలంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు, బాధితులకు నిత్యావసర వస్తువులు ఆయా గ్రామాలకు తరలించే విధంగా చర్యలు తీసుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు