ఫ్లిప్‌కార్ట్‌లో హైఫీచర్స్ ఫోన్ కేవలం రూ.10,999కే..

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో అనేక కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సేల్ లో రియల్ మీ 12x 5జీ ఫోన్ పై(Realme 12x 5G)భారీ తగ్గింపు కొనసాగుతుంది. అయితే ఎంత తగ్గించారో తెలుసుకోవాలనుకుంటే చూసేయండి..

New Update
ఫ్లిప్‌కార్ట్‌లో హైఫీచర్స్ ఫోన్ కేవలం రూ.10,999కే..

ఎవరైనా కొత్త ఫోన్ ని కొనుగోలు చేయాలని ఫ్లాన్ చేసినప్పుడు..ముందు ఆలోచించే విషయం ఏంటంటే తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లు ఏ ఫోన్ లో లభిస్తాయి అని. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో అనేక కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సేల్ లో రియల్ మీ 12x 5జీ ఫోన్ పై(Realme 12x 5G)భారీ తగ్గింపు ఇవ్వబడుతోంది. ఈ ఫోన్ ని ఆఫర్ లో కేవలం రూ.10,999కే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ బ్యానర్ ప్రకారం..ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోన్ ఇదే.

4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్, 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ అనే మూడు వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

Realme 12X 5G ఫోన్.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72 అంగుళాల పూర్తి HD+ IPS LCD డిస్ ప్లే ని కలిగి ఉంది. Realme UI 5.0తో ఆండ్రాయిడ్ 14లో ఈ ఫోన్ పని చేస్తుంది. Realme UI 5.0 అనేది ఆండ్రాయిడ్ కస్టమైజ్డ్ వెర్షన్‌ను అందించే కంపెనీ కస్టమ్ స్కిన్. డైమెన్షన్ 6100+ 6nm 5G చిప్‌సెట్ ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంది.

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా పవర్ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో అందించబడింది. ఈ డివైజ్ నీరు, దుమ్ము నుండి రక్షణ కోసం IP54 రేటింగ్‌ను పొందుతుంది.

Advertisment
తాజా కథనాలు