Flipkart Offers: 26 వేల Realme ఫోన్ కేవలం 6 వేలకే.. ఫ్లిప్‌కార్ట్‌లో పిచ్చెక్కించే ఇయర్ ఎండ్ ఆఫర్!

ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ కింద దుమ్ములేపే డిస్కౌంట్లను అందిస్తోంది. రూ.26 వేల విలువైన Realme 11 Pro 5G స్మార్ట్ ఫోన్ ను రూ.4 వేల డిస్కౌంట్ తో పాటు ఎక్సేంజ్ ఆఫర్ తో కొనుగోలు చేస్తే కేవలం రూ.6 వేలకే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

New Update
Flipkart Offers: 26 వేల Realme ఫోన్ కేవలం 6 వేలకే.. ఫ్లిప్‌కార్ట్‌లో పిచ్చెక్కించే ఇయర్ ఎండ్ ఆఫర్!

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఇయర్ ఎండ్ సందర్భంగా మరోసారి భారీ ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చింది. వింటర్ ఫెస్ట్ సేల్ ను (Flipkart Winter Fest Sale) ప్రకటించింది. డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనున్నట్లు ప్రకటించింది. న్యూ ఇయర్ సందర్భంగా కొత్త స్మార్ట్ ఫోన్ కొనడానికి మీరు ఎదురు చూస్తుంటే.. ఈ సేల్ మీకు సూపర్ చాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై సూపర్ ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా Realme 11 Pro 5G ఫోన్ ను బెస్ట్ డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ను కంపెనీ జూన్‌లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క బేస్ వేరియంట్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.25,999. కానీ సేల్ లో రూ. 4 వేల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.21,999కే అందుబాటులో ఉంది.
ఇది కూడా చదవండి: iphone Offers: మళ్లీ మళ్లీ రాని ఆఫర్.. సగం ధరకే ఈ ఐఫోన్!

ఇంకా బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో కొనుగోలు చేయడం ద్వారా కస్టమర్లు 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా అందుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా అదనంగా మరో రూ.16,050 వరకు తగ్గింపును కూడా అందుకోవచ్చు. మీ ఫోన్ మోడల్ కొత్తగా ఉండి.. కండిషన్ బాగుంటే మీరు పూర్తి డిస్కౌంట్ అందుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Tech News : కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే.. మీ పాత ఫోన్‌ను ఈ 5 సైట్లలో అమ్మేయండి!

ఎక్సేంజ్ ఆఫర్ కూడా మీకు వర్తిస్తే ఈ ఫోన్ ను  ఇంకా నో-కాస్ట్ EMI ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. Realme 11 Pro 5G ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ MediaTek Dimensity 7050 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం.. ఫోన్ వెనుక భాగంలో 100MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉంది. సెల్ఫీ కోసం 16MP కెమెరా ఉంది. ఇంకా ఈ ఫోన్ 5000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది.

Advertisment
తాజా కథనాలు