Flipkart : ఆపిల్ టాబ్లెట్‌ల పై భారీ డిస్కౌంట్స్ .. కేవలం రూ. 28,900..!

ఫ్లిప్ కార్ట్ తమ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఆపిల్ టాబ్లెట్‌ల పై భారీ డిస్కౌంట్స్ ను అందిస్తోంది. Apple iPad 10th gen కేవలం 28,900 రూపాయలకే అందుబాటులో ఉంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 3,000 తగ్గింపును పొందవచ్చు.

Flipkart : ఆపిల్ టాబ్లెట్‌ల పై భారీ డిస్కౌంట్స్ .. కేవలం రూ. 28,900..!
New Update

Apple iPad 10th Gen Flipkart : కేవలం 28,900 రూపాయలకే అందుబాటులో ఉంది. అయితే ఈ టాబ్లెట్ కొంచెం పాత వెర్షన్. కానీ, ఇది ఇప్పటికీ శక్తివంతమైన A14 బయోనిక్ ప్రాసెసర్, యాపిల్ లిక్విడ్ రెటినా డిస్ప్లేను కలిగి ఉంది. iPad 10th Gen గురించి మిగిలిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము .. .

ఐప్యాడ్ 10th Gen 64GB వేరియంట్ కేవలం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) లో రూ. 31,900కి అందుబాటులో ఉంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 3,000 తగ్గింపును పొందవచ్చు. అంటే కేవలం 28,000 ఐప్యాడ్ ను పొందవచ్చు. ఈ తగ్గింపు EMI, EMI యేతర లావాదేవీలకు కూడా వర్తిస్తుంది.

ఐప్యాడ్ 10th Gen వివిధ వేరియంట్‌ల గురించి మాట్లాడితే, 64GB Wi-Fi రూ. 31,900 అందుబాటులో ఉంది. దీనిని రూ. 28,900కి కార్డ్ ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా, 256GB Wi-Fi రూ.49,990కి బదులుగా రూ.46,900కు,

64 GB సెల్యులార్ రూ.49,990కు బదులుగా రూ.46,900కి, 256 GB సెల్యులార్ రూ.68,900 కు బదులుగా రూ.65,900కు కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ , కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్, EMI లావాదేవీలపై రూ. 2,000 వరకు తగ్గింపు కూడా ఇవ్వబడుతుంది.

iPad 10th gen 2022 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇది 10.9-అంగుళాల లిక్విడ్ రెటినా IPS LCD డిస్ప్లేతో 2630×1640 పిక్సెల్ రిజల్యూషన్, Apple A14 బయోనిక్ ప్రాసెసర్, iPadOS 17, 12MP వెనుక కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా, స్టీరియో స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్‌లతో వస్తుంది.

Also Read: Amazon: గ్యాడ్జెట్ ప్రియులకు అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1000 కంటే తక్కువ ధరతో గేమ్ ప్యాడ్, గేమింగ్ హెడ్సెట్..!

#emi #flipkart #apple-ipad-10th-gen
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe