iPhone 15: భారీగా తగ్గిన ఐఫోన్ 15 ధరలు! ఇప్పుడు రూ.35,000 కే ఐఫోన్ 15 ను దక్కించుకోండి!

ప్రముఖ ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 15పై అదిరిపోయే డీల్ ప్రకటించింది. భారీగా డిస్కౌంట్ తగ్గించి ఇతర ముబైల్ కంపెనీలకు షాక్ ఇచ్చింది. ఈ డివైజ్‌ను ఇప్పుడు రూ.35వేల కే దక్కించుకోవచ్చు.అది ఎలానో తెలుసుకోవాలనుకుంటే ఇది చదివేయండి!

New Update
iPhone 15: భారీగా తగ్గిన ఐఫోన్ 15 ధరలు! ఇప్పుడు రూ.35,000 కే ఐఫోన్ 15 ను దక్కించుకోండి!

గ్లోబల్ టెక్ బ్రాండ్ యాపిల్ (Apple) గత ఏడాది లేటెస్ట్ ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ లైనప్‌లో మొత్తం నాలుగు వేరియంట్లు సరికొత్త ఫీచర్లతో వచ్చాయి. వీటి ధరలు కూడా భారీగా ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఐఫోన్ 15 సిరీస్ ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 15పై అదిరిపోయే డీల్ ప్రకటించింది. ఈ డివైజ్‌ను రూ.35వేల కంటే తక్కువకు కొనుగోలు చేయవచ్చు.

128GB స్టోరేజ్ మోడల్ ఐఫోన్ 15 అసలు ధర రూ.79,900. అయితే ఫ్లిప్‌కార్ట్‌ దీనిపై 17 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అంటే ఫోన్ ధర రూ.65,999కి తగ్గుతుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ తమ పోర్టల్‌లో మంచి బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు అందిస్తోంది.ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15ను బ్యాంక్ ఆఫ్ బరోడా అనుబంధ సంస్థ అయిన BOBCARDతో కొనుగోలు చేస్తే, (50,000, అంతకంటే ఎక్కువ ఆర్డర్లపై) అదనంగా రూ.3,000 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో మొబైల్ ధర రూ.62,999కి తగ్గుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అందిస్తోంది.

మంచి వర్కింగ్ కండిషన్‌లో ఉన్న టాప్ బ్రాండ్ ప్రీమియం ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేస్తే, కస్టమర్లు గరిష్టంగా రూ.50,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్‌ఛేంజ్ డీల్ కనీసం రూ.30,000 వరకు ఉన్నా, ఐఫోన్ 15 ధర రూ.32,999కి తగ్గుతుంది.అయితే ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కొన్ని పిన్‌కోడ్ అడ్రస్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే సరిగా పనిచేసే లేటెస్ట్ మోడల్ ప్రీమియం ఫోన్లకు ఎక్కువ ట్రేడ్‌ఇన్ వాల్యూ లభిస్తుంది. ఈ డీల్ గురించి మరిన్ని వివరాలను ఫ్లిప్‌కార్ట్ యాప్, పోర్టల్‌లో చెక్ చేయవచ్చు. కొత్త ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ అయ్యే వారికి తాజా ఆఫర్లు బెస్ట్ డీల్స్‌గా చెప్పుకోవచ్చు.

యాపిల్ ఐఫోన్ 15 అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో లాంచ్ అయింది. 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో డివైజ్ వస్తుంది. స్క్రీన్ 2000 నిట్స్ పీక్‌బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. డైనమిక్ ఐలాండ్ టెక్నాలజీ దీని స్పెషాలిటీ. కొత్త ఐఫోన్ సిరీస్‌లో ఇండస్ట్రీ ఫస్ట్ కెమెరా స్పెసిఫికేషన్స్ ఆన్నాయి. 48MP ప్రైమరీ లెన్స్ మంచి అవుట్‌పుట్ అందిస్తుంది.ఈ కెమెరా సిస్టమ్ క్వాడ్-పిక్సెల్ సెన్సార్‌తో, ఆటోఫోకస్ కోసం 100 శాతం ఫోకస్ పిక్సెల్స్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది డీటేల్డ్ ఇమేజ్ కోసం 24MP సూపర్-హై-రిజల్యూషన్ డిఫాల్ట్ సెట్టింగ్‌ను యూజ్ చేస్తుంది. ఐఫోన్ 15 యూజర్లు 2x టెలిఫోటో లెన్స్‌తో ఫోటోలు, వీడియోలు షూట్ చేయవచ్చు. అలాగే 0.5x, 1x, 2x జూమ్ ఆప్షన్లు ఉన్నాయి.

ఐఫోన్ 15లో A16 బయోనిక్ చిప్ ఉంటుంది. ఇది ఫాస్ట్ పర్ఫార్మెన్స్‌తో యూజర్లను ఇంప్రెస్ చేస్తుంది. హాప్టిక్ టచ్, 4K వీడియో రికార్డింగ్, ఫేస్ ID, క్రాష్ డిటెక్షన్, సిరి వాయిస్ అసిస్టెంట్, 20 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్.. ఇతర ఫీచర్లతో ఐఫోన్ 15 మార్కెట్‌లో సూపర్ సక్సెస్ అయింది.

Advertisment
తాజా కథనాలు