Redmi Note 12 నుంచి iPhone 12 వరకు.. Flipkart Big Billion Days Saleలో బెస్ట్ ఆఫర్లు ఇవే!

స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లతో సహా ఎలక్ట్రానిక్ ప్రొడక్టుల రేంజ్‌‌పై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ సేల్‌ లో సామ్‌ సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌ 13, మోటారోలా జీ 32, ఒప్పో ఏ 17 కే, రియల్‌ మీ సీ 55 ఇతర స్మార్ట్‌ ఫోన్ల ధరలను తగ్గిస్తుంది.

New Update
Redmi Note 12 నుంచి iPhone 12 వరకు.. Flipkart Big Billion Days Saleలో బెస్ట్ ఆఫర్లు ఇవే!

యావత్ దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్లిప్‌ కార్ట్‌ (Flipkart ) బిగ్‌ బిలియన్‌ డేస్‌ (Big billion days) సేల్ పండుగ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ ఏడాది బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ అక్టోబర్‌ 8న ప్రారంభమై అక్టోబర్‌ 15 వరకు ఉంటుంది. ఫ్లిప్‌ కార్ట్‌ ప్లస్‌ సభ్యులు అయితే అక్టోబర్‌ 7 నుంచే ఈ ఆఫర్లను ముందుగానే పొందవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లతో సహా ఎలక్ట్రానిక్ ప్రొడక్టుల రేంజ్‌‌పై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ సేల్‌ లో సామ్‌ సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌ 13, మోటారోలా జీ 32, ఒప్పో ఏ 17 కే, రియల్‌ మీ సీ 55 ఇతర స్మార్ట్‌ ఫోన్ల ధరలను తగ్గిస్తుంది.

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌ 13:
ఫ్లిప్‌ కార్ట్‌ సేల్‌ సమయంలో సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌ 13 స్మార్ట్‌ ఫోన్‌ ను రూ. 9,199 తగ్గింపును అందజేస్తుంది. ఈ డివైజ్ గొరిల్లా గ్లాస్‌ 5 తో 6.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ ప్లేను కలిగి ఉంటుంది. 8 జీబీ రామ్‌ తో, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీతో ఈ ఫోన్‌ అందుబాటులోకి వస్తుంది. దీని కెమెరా సెటప్‌ లో హై క్వాలిటీ ఫోటోల కోసం 50 ఎమ్‌పీ ప్రైమరీ కెమెరా కూడా ఉంది. 8MP ఫ్రంట్ కెమెరాతో ఇంటర్ లింక్ అయింది. ఇందులో 6000mAh లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు రిటైల్ ధర రూ. 14999కు సొంతం చేసుకోవచ్చు.

మోటోరోలా జీ 32:
ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధరల 18,999 ఉండగా బిగ్‌ బిలియన్ డేస్‌ ఆఫర్ లో రూ. 9999 కే వస్తుంది. ఈ డివైజ్‌ 90 హెచ్‌జ్‌ , 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌ డీ ప్లస్ డిస్‌ ప్లేను కలిగి ఉంటుంది. 50 ఎమ్ పీ మెయిన్‌ కెమెరా, 16 ఎమ్‌ పీ ఫ్రంట్‌ కెమెరాతో సహా ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ను కలిగి ఉంది. 5000mAh లిథియం పాలిమర్ బ్యాటరీతో వస్తుంది. 33W TurboPower ఛార్జర్‌కు సపోర్టు ఇస్తుంది.

ఒప్పో ఏ 17 కే:
ఈ స్మార్ట్ రిటైల్ ధర రూ. 12,999 నుంచి 30 శాతం తగ్గింపు అందిస్తుంది.అంటే కేవలం రూ. 8,999కే దీనిని సొంతం చేసుకోవచ్చు ఇది 6.56-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. MediaTek Helio P35 ప్రాసెసర్‌ కలిగి ఉంటుంది. దీనిలో 8MP AI మెయిన్‌ కెమెరా, సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5000mAh బ్యాటరీతో వస్తుంది.

పోకో ఎమ్‌ 17:
ఫ్లిప్‌ కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్ సేల్ లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ కేవలం రూ.7,777 కే లభిస్తుంది. అసలు ధర రూ. 15,999 ఉండగా సుమారు 51 శాతం తగ్గింపును అందిస్తోంది. 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ ప్లే ను కలిగి ఉంది. AI ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP అల్ట్రా HD ప్రధాన కెమెరా, 2MP డెప్త్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి.

రియల్‌ మీ సీ 55:
ఈ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సమయంలో రియల్‌ మీ సీ 55ని రూ.9,999 కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ. 12,999 ఉండగా అదిరిపోయే తగ్గింపు ధర అందిస్తోంది. 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌ డీ ప్లస్ డిస్‌ ప్లేను కలిగి ఉంది. 64 MP AI కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాతో సహా డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 16GB డైనమిక్ RAMతో Helio G88 ప్రాసెసర్ కలిగి ఉంది. 33W SUPERVOOC ఛార్జ్‌తో కూడిన 5000mAh బ్యాటరీతో వస్తుంది.

రెడ్‌ మీ నోట్‌ 12:
రెడ్‌ మీ నోట్‌ 12 ఈ బిగ్‌ బిలియన్‌ డేస్ లో రూ 10, 799 కే లభిస్తుంది. వివిధ బ్యాంకు కార్టులు ఉపయోగించి దీని మీద మరింత డిస్కౌంట్లు పొందవచ్చు. ఈఎమ్‌ఐ ఆప్షన్‌ కూడా ఉంది.

ఐఫోన్ 12 :
ఐ ఫోన్‌ 12: ప్రారంభ ధర రూ. 32,999 అందుబాటులో ఉంటుంది. సేల్ కోసం తయారు చేసిన మైక్రోసైట్ ప్రకారం ఐఫోన్ 12 డీల్ ధర రూ.38,999. ఫోన్‌పై రూ. 3000 బ్యాంక్ ఆఫర్ , రూ. 3000 అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉన్నాయి. దీనితో మీరు ఈ ఆపిల్ ఫోన్‌ను రూ. 32,999 కే పొందవచ్చు.

Advertisment
తాజా కథనాలు