Stock Market Today: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్..

ఈరోజు అంటే ఆగస్టు 27న స్టాక్ మార్కెట్ ఫ్లాట్ గా ముగిసింది. ఉదయం నుంచి ఇండెక్స్ లు ఫ్లాట్ గానే కదిలాయి. సెన్సెక్స్ 30 స్టాక్స్ లో 19 నష్టాల్లోనూ.. 11 లాభాల్లోనూ ముగిశాయి. అలాగే నిఫ్టీ 50లో 31 స్టాక్స్ నష్టపోగా.. 19 స్టాక్స్ లాభాలను చూశాయి.

New Update
Disaster Recovery : సెలవు రోజు అయినా ఆరోజు స్టాక్ మార్కెట్ పనిచేస్తుంది.. ఎందుకంటే.. 

Stock Market Today: ఒక పక్క అతర్జాతీయంగా మార్కెట్లు కిందా మీదా పడుతున్నప్పటికీ.. మన స్టాక్ మార్కెట్ ఈరోజు ఫ్లాట్ గా ముగిసింది. ఉదయం నుచి ఫ్లాట్ గా ప్రారంభమైన ఇండెక్స్ లు ట్రేడింగ్ ముగిసే వరకూ దాదాపు అదే ధోరణిలో కొనసాగాయి. మొత్తంమీద ఈరోజు అంటే ఆగస్టు 27న సెన్సెక్స్ 13 పాయింట్ల లాభంతో 81,711 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 7 పాయింట్లు పెరిగి 25,017 వద్ద ముగిసింది. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 19 క్షీణించగా, 11 పెరిగాయి. 50 నిఫ్టీ స్టాక్స్‌లో 31 క్షీణించగా, 18 పెరిగాయి. నిఫ్టీలో బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ గెయినర్‌గా నిలిచింది.

సెన్సెక్స్ టాప్ గెయినర్స్ ..
Stock Market Today: బజాజ్ ఫిన్ సర్వ్ 2.07% పెరిగింది. మారుతి 2.04% లాభాల్లో ఉంది. ఎల్ అండ్ టీ 1.17% పెరుగుదల కనబరచగా బజాజ్ ఫైనాన్స్ 1.37% లాభాలను చూసింది. ఇక ఇన్ఫోసిస్ 1.29% లాభాలతో ట్రేడ్ అయింది.
సెన్సెక్స్ టాప్ లూజర్స్..
టైటాన్ 2.19%, jsw స్టీల్ 2.01%, టాటా మోటార్స్ 1.37%, ntpc 1.24%, ఐటీసీ 1.01% నష్టపోయాయి.
నిఫ్టీలో టాప్ గెయినర్స్..
Stock Market Today: బజాజ్ ఫిన్ సర్వ్ 2.46%, ఎస్బీఐ లైఫ్ 2.27%, మారుతి 1.91%, hdfc లైఫ్ 1.66%, ఎల్ అండ్ టీ 1.60% లాభాలను చూశాయి.
నిఫ్టీలో టాప్ లూజర్స్..
jsw స్టీల్ 2.04%, టైటాన్ 2.19%, హిందుస్తాన్ లీవర్ 1.92%, గ్రాసిమ్ 1.26%, కోల్ ఇండియా 1.18% నష్టపోయాయి.


ఆసియా మార్కెట్లు పతనం..

  • Stock Market Today: ఈరోజు ఆసియా లోని ప్రధాన స్టాక్ మార్కెట్లు అన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్‌లో జపాన్‌కు చెందిన నిక్కీ 0.14%, హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సెంగ్ 0.27% నష్టపోయాయి. చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.40%, కొరియాకు చెందిన కోస్పి 0.35% క్షీణతలో ట్రేడవుతున్నాయి.
  • ఇక NSE డేటా ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) ఆగస్టు 26న ₹483.36 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఇదే సమయంలో దేశీయ పెట్టుబడిదారులు (DIIలు) కూడా ₹1,870.22 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
  • ఆగస్టు 26న అంటే సోమవారం అమెరికా మార్కెట్‌కు చెందిన డౌ జోన్స్ 0.16% పెరుగుదలతో 41,240 వద్ద ముగిసింది. నాస్‌డాక్ 0.85% పడిపోయి 17,725 వద్ద ముగిసింది. S&P500 0.32% క్షీణించి 5,616 వద్ద ముగిసింది.
Advertisment
తాజా కథనాలు