Fixed Deposit Tips: FDలపై వడ్డీ బాగా పెరిగింది.. డిపాజిట్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి ప్రస్తుతం బ్యాంకులు ఫిక్సెడ్ డిపాజిట్ (FD)లపై వడ్డీని ఎక్కువగానే ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో FDలో ఇన్వెస్ట్ చేయాలని చాలామంది అనుకుంటున్నారు. అంతేకాకుండా FD వలన రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. అయితే, మీరు FD చేయాలి అనుకుంటే అన్ని విషయాలను పరిశీలించి బ్యాంకును ఎంచుకోవాలి By KVD Varma 19 Jan 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Fixed Deposit Tips: ఫిక్సెడ్ డిపాజిట్ (FD) అనేది పెట్టుబడి కోసం అత్యంత ప్రజాదరణ పొందిన పద్ధతుల్లో ఒకటి. ముఖ్యంగా రిస్క్ తీసుకోవాడానికి ఇష్టపడని వ్యక్తులకు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు మంచి ఎంపికగా చెప్పవచ్చు. మీరు కూడా ఎఫ్‌డిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఇన్వెస్ట్ చేసే ముందు ఏ బ్యాంకు ఎఫ్‌డిపై ఎక్కువ వడ్డీ ఇస్తుందో చూడాలి. ప్రస్తుతం కొన్ని ప్రయివేట్ బ్యాంకులు 8 శాతం వరకూ వడ్డీని అందిస్తున్నాయి. ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులలో FD చేయడం మంచిది. FD చేయాలి అనుకునేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.. అవేమిటంటే.. ఎఫ్‌డిని ఎన్ని సంవత్సరాలకు చేయాలి? ఎఫ్‌డి (Fixed Deposit Tips)చేసేటప్పుడు, దాని పదవీకాలాన్ని నిర్ణయించే ముందు జాగ్రత్తగా ఆలోచించడం ముఖ్యం. ఎందుకంటే ఇన్వెస్టర్లు మెచ్యూరిటీకి ముందే మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుంటే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. FD మెచ్యూర్ కావడానికి ముందే వెనక్కి తీసుకుంటే, 1% వరకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది డిపాజిట్‌పై వచ్చే మొత్తం వడ్డీని తగ్గించవచ్చు. అందుకే ఎక్కువ వడ్డీ వస్తుందనే భ్రమతో లాంగ్ టర్మ్ FD చేయాలని అనుకోవడం మంచిది కాదు. మొత్తం డబ్బును ఒకే FDలో పెట్టుబడి పెట్టకండి Fixed Deposit Tips: మీరు బ్యాంకులో ఒక పదిలక్షల రూపాయలు FD చేయాలి అనుకుంటే.. దానిని ఒకే బ్యాంకులో చేయవద్దు. దానికి బదులుగా రెండు లేదా మూడు వేర్వేరు బ్యాంకుల్లో చేయండి. ఎందుకంటే, ఎప్పుడైనా మధ్యలో అకస్మాత్తుగా డబ్బు అవసరం అయినపుడు మీ అవసరాన్ని బట్టి.. తక్కువ పెనాల్టీ ఉండే బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే పది లక్షలు లాంటి పెద్ద మొత్తం ఒకే బ్యాంకులో ఉండడం వలన మీకు మూడు లక్షలు అవసరం అయినా మొత్తం డబ్బును తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మొత్తానికి పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. వడ్డీ తీసుకోవడం.. Fixed Deposit Tips: గతంలో బ్యాంకుల్లో త్రైమాసిక -వార్షిక ప్రాతిపదికన వడ్డీని తీసుకునే అవకాశం ఉండేది. అయితే, ఇప్పుడు కొన్ని బ్యాంకుల్లో నెలవారీ విత్‌డ్రా కూడా చేయవచ్చు. మీ అవసరాన్ని బట్టి మీరు దానిని ఎంచుకోవచ్చు. FDలో అందుబాటులో ఉన్న లోన్ వడ్డీ రేటును కూడా చెక్ చేయండి.. Fixed Deposit Tips: మీరు మీ FDపై కూడా లోన్ తీసుకోవచ్చు. దీని కింద, మీరు FD విలువలో 90% వరకు లోన్ తీసుకోవచ్చు. మీ FD విలువ రూ. 1.5 లక్షలు అనుకుందాం.. అప్పుడు మీరు రూ. 1 లక్ష 35 వేలు రుణం పొందవచ్చు. మీరు FDపై లోన్ తీసుకుంటే, మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పొందే వడ్డీ కంటే 1-2% ఎక్కువ వడ్డీని చెల్లించాలి. ఉదాహరణకు, మీరు మీ FDపై 6% వడ్డీని పొందుతున్నారని అనుకుందాం, అప్పుడు మీరు 7 నుంచి 8% వడ్డీ రేటుతో లోన్ పొందవచ్చు. సీనియర్ సిటిజన్‌లకు ఎక్కువ వడ్డీ లభిస్తుంది.. Fixed Deposit Tips: చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్‌లకు FDపై 0.50% వరకు ఎక్కువ వడ్డీని అందిస్తాయి. అటువంటి పరిస్థితిలో, మీ ఇంట్లో సీనియర్ సిటిజన్ ఉన్నట్లయితే, మీరు అతని పేరు మీద FDని చేయడం ద్వారా మరింత లాభం పొందవచ్చు. Also Read: నెలరోజుల్లోనే రన్ ముగిసిందా..అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది Watch this interesting Video: #bank-deposits #fixed-deposite మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి