5 Ways To Reduce Anxiety : ప్రస్తుత కాలంలో ప్రజలు అనేక రకాల శారీరక, మానసిక సమస్య తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెరుగుతున్న పని భారం, వేగంగా మారుతున్న జీవనశైలే ఇందుకు కారణం. అయితే..ఈ రోజుల్లో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్యలలో ఆందోళన(Anxiety) ఒకటి. ఆందోళన అనేది ఓ మానసిక సమస్య. ఇది ఓ రకంగా చెప్పాలంటే సాధారణ మానసిక రుగ్మత. ఇది ప్రధానంగా ఒత్తిడితో కలిగి ఉంటుంది. అయితే.. ఆందోళన తీవ్రంగా ఉంటే మూర్ఛలు, భయం, భయాందోళన, బాధగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆందోళన అనేది కండరాల ఒత్తిడి, చంచలత్వం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఒంటరితనం, పనిపై దృష్టి పెట్టే సామర్థ్యం తగ్గడం వంటి అనేక లక్షణాలు ఉంటాయి. అయితే ఆందోళన సమస్య ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే చిట్కాలున్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సులభమైన పద్ధతులతో ఉపశమనం
లక్షణాలు ఇవే:
- ఆందోళన(Anxiety) సమస్య ఉంటే దాని లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. ఆందోళన సమస్య ఉంటే చెమట, వణుకు, శ్వాస ఆడకపోవటం, విచారం, నియంత్రణను కోల్పోతానే భయం, శారీరక, భావోద్వేగ వంటి లక్షణాలుంటాయి. ఆందోళనతో బాధపడుతున్నప్పుడు.. స్నేహితుడు, కుటుంబ సభ్యుడు, మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.
శ్వాస వ్యాయామాలు:
- ఆందోళన సమస్య ఉంటే..దాని నుంచి ఉపశమనం పొందడానికి శ్వాస వ్యాయామాలు చేయవచ్చు . ఇది మనస్సు, శరీరాన్ని శాంతపరుస్తుంది. ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, కొన్ని సెకన్ల పాటు శ్వాసను పట్టుకుని, ఆపై నోటి ద్వారా ఊపిరి పీల్చుకోవడం వలన ఆందోళన సమస్య తగ్గుతుంది.
ప్రతికూల ఆలోచనలు
- ఆందోళన ఉంటే వారి ఆలోచనలు ప్రతికూలంగా మార్చుకోవలి. ఇలా చేస్తే సమస్యను దూరం చేయవచ్చు. ఎక్కువగా సానుకూల విషయాలపై దృష్టి, సంతోషాన్ని కలిగించే పనులు చేస్తే ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది.
యోగా- విశ్రాంతి
- ఆందోళన(Anxiety) సమస్య ఉంటే ఎక్కువగా విశ్రాంతి(Rest) తీసుకోవాలి. ఇలా చేస్తే ఉపశమనం లభిస్తుంది. దీని కోసం మీరు హాట్ షవర్, యోగా(Yoga) సాధన, ప్రశాంతమైన సంగీతాన్ని వినడం, పుస్తకాన్ని చదవడం వంటి కూడా చేయవచ్చు. దృష్టి మరల్చడానికి డ్యాన్స్‌ని కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. ఇలాంటి కార్యక్రమాలతో ఆందోళన తీవ్రతను తగ్గుతుంది.
ఇతరుల సహాయం
- ఎలాంటి పరిస్థితిలోనైనా ఇతరుల సహాయం, మద్దతు తీసుకోండి. ఆందోళనతో బాధపడుతున్నప్పుడు.. స్నేహితుడు, కుటుంబ సభ్యుడు, మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.
ఇది కూడా చదవండి: ఆరోగ్యకరమైన అల్పాహారం.. బ్రౌన్‌బ్రెడ్ తయారీ విధానం
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.