Airports: సైన్స్ ఎంతగానో పురోగమించిన నేటి యుగంలో మనం గంటలలో మైళ్లను దాటేంతగా అభివృద్ధి చెందినప్పటికీ ప్రపంచంలోని కొన్ని దేశాలు ఇప్పటికీ ఎయిర్‌పోర్టులు కూడా లేనివి ఉన్నాయి. ఏదైనా దేశానికి చేరుకోవాలంటే అక్కడ విమానాశ్రయం ఉండాల్సిందేనని అనుకుంటే పొరపడినట్టే. కొన్ని దేశాల్లో ఎయిర్‌పోర్టులు లేకపోయినా అక్కడికి ప్రజలు ప్రపంచం నలుమూలల నుంచి వెళ్తుంటారు. అంతేకాకుండా అక్కడి నుంచి రవాణా కూడా బాగుంటుంది.
ప్రపంచంలోనే అతి చిన్న దేశం వాటికన్ సిటీ. కేవలం 825 మంది జనాభా ఉన్న ఈ దేశంలో ఫ్లైట్ ల్యాండింగ్‌కు స్థలం గానీ, సముద్రం గానీ, నది గానీ లేవు. కేవలం రైలు మార్గం మాత్రమే ఉంటుంది. దాని పక్కన ఉన్న దేశాల నుంచి కాలినడకన కూడా చేరుకోవచ్చు. ఈ జాబితాలో మరో దేశం మొనాకో. ఇది మూడు వైపులా ఫ్రాన్స్ దేశం కలిగి ఉంటుంది. ఐరోపాలో రెండవ అతి చిన్న దేశం. దీనికి సొంత విమానాశ్రయం లేదు. అందువల్ల ప్రజలు ఫ్రాన్స్‌లోని విమానాశ్రయాల నుంచి మాత్రమే ఇక్కడికి వస్తారు. తర్వాత అక్కడి నుంచి పడవ లేదా క్యాబ్‌లో మొనాకో చేరుకోవాలి.
శాన్ మారినో ప్రపంచంలోని పురాతన దేశాలలో ఒకటి. ఇటలీ చుట్టూ ఉన్న ఈ దేశానికి విమానాశ్రయం లేదు. సముద్ర మార్గం కూడా లేదు. ఇది ఇటలీకి చెందిన రిమిని ఎయిర్‌పోర్టు నుంచి ఇక్కడికి రోడ్డు ద్వారా చేరుకోవచ్చు. తర్వాత దేశం లీచ్టెన్‌స్టెయిన్. ఇది 75 కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఇక్కడ కూడా సొంత విమానాశ్రయం లేదు. అయితే ఇక్కడి నుంచి ప్రయాణించడానికి ప్రజలు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ విమానాశ్రయం సహాయం తీసుకుంటారు. దేశాల విస్తీర్ణం చిన్నగా ఉండటం వల్ల ఇక్కడ ఎలాంటి ఎయిర్‌పోర్టులు పెట్టే సదుపాయం లేదు.
ఇది కూడా చదవండి: గురుగ్రామ్‌లో విషాదం.. శ్మశానవాటిక గోడ కూలి ఐదుగురు మృతి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.