Rajadhani Files Movie: 'రాజధాని ఫైల్స్' చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. టైటిల్ లోగోలో పొలం దున్నే నాగలి ఉండటంతో పోస్టర్ ప్రేక్షకులకు ఎంతో ఆకట్టుకుంటుంది. పోస్టర్ చూసినట్లైతే ఒక యువ నాయకుడు.. వేలాది రైతు కుటుంబాలకు నేనున్నాను అనే భరోసా ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ లో మరో రాజకీయ నాయకుడు రూపం ఉన్నట్లుగా తెలుస్తోంది. పోస్టర్ పై ఒకే ఒక్కడి అహం.. వేలాది రైతులకి కన్నీరు.. కోట్ల కుటుంబాల భవిష్యత్తు అంధకారం అని రాసుంది.
Also Read: ముద్దనూరు అల్లర్ల ఘటనపై సీరియస్ యాక్షన్ తీసుకున్న కర్నూలు రేంజ్ డీఐజీ.!
వాస్తవ సంఘటనలకు సహజమైన భావోద్వేగాలను జోడించి ప్రేక్షుకుల్లో ఆలోచన రేకెత్తించేలా ఈ చిత్రాన్ని రూపొందించారని కనిపిస్తోంది. సంగీత దర్శకుడు మణిశర్మ (Mani Sharma), ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ వంటి వారు ఈ సినిమా కోసం పని చేయడం మరింత విశేషం. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.
Also Read: చంద్రబాబు, పవన్ పై చెడుగా మాట్లాడే కుక్కల తాట తీస్తా.. బుద్దా వెంకన్న వార్నింగ్
రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనని కళ్ళకి కట్టినట్టుగా ఈ సినిమాలో చూపిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం 'రాజధాని ఫైల్స్' శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై కంఠంనేని రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు.