జైపూర్‌- ముంబై ఎక్స్‌ప్రెస్‌ రైలులో కాల్పులు..నలుగురి మృతి!

మహారాష్ట్రలోని పాల్ఘర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో జైపూర్‌- ముంబై ఎక్స్‌ప్రెస్‌ రైలులో కాల్పులు ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఒక ఆర్పీఎఫ్‌ ఏఎస్‌ఐ, ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.

జైపూర్‌- ముంబై ఎక్స్‌ప్రెస్‌ రైలులో కాల్పులు..నలుగురి మృతి!
New Update

మహారాష్ట్రలోని పాల్ఘర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో జైపూర్‌- ముంబై ఎక్స్‌ప్రెస్‌ రైలులో కాల్పులు ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఒక ఆర్పీఎఫ్‌ ఏఎస్‌ఐ, ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో జరిగింది. ఈ ఘటన జైపూర్‌ ఎక్స్‌ప్రెస్ రైలు జైపూర్‌ నుంచి ముంబై వెళ్తున్న రైలులో ఈ కాల్పుల ఘటన జరిగింది.

కాల్పులు జరిపిన వ్యక్తిని కానిస్టేబుల్ చేతన్‌ సింగ్‌ గా గుర్తించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్‌ డిప్రెషన్‌ లో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. పాల్ఘర్‌ రైల్వే స్టేషన్ దాటిన అనంతరం జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ప్రయాణికులు మీద కాల్పులు జరిపిన అనంతరం దహిసర్‌ స్టేషన్‌ దగ్గరలో ఉంది అనగా నిందితుడు ఒక్కసారిగా రైలు నుంచి కిందకి దూకేశాడని రైలులోని కొందరు ప్రయాణికులు చెబుతున్నప్పటికీ..పోలీసులు మాత్రం కానిస్టేబుల్‌ తో సహా అతను కాల్పులు జరిపిన గన్‌ ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు మరి కొందరు చెబుతున్నారు.

దాడి జరిగిన అనంతరం రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు వాంగ్మూలాలను కూడా నమోదు చేయనున్నట్లు పశ్చిమ రైల్వే పోలీసులు తెలిపారు. అయితే నిందితుడు జరిపిన కాల్పుల్లో ఎక్కువ మంది ప్రయాణికులు గాయపడలేదు. ఇదంతా ఇలా ఉంటే నిందితుడు మానసిక పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద పోలీసులు ఆరా తీస్తున్నారు.

కేవలం అతను మతి స్థిమితం లేక ఈ కాల్పులు జరిపాడా? లేక కాల్పులు జరగడానికి ముందు రైలులో తోటి ప్రయాణికులతో ఏమైనా గొడవ జరిగిందా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.

#gun-shot #crime #mambai-express
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి