తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫొటో ఫ్రేమ్‌ వర్క్స్‌ దుకాణంలో మంటలు చెలరేగాయి. రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదం జరగడం.. మంటలు ఇళ్ల వైపు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గోవిందరాజస్వామి ఆలయ రథం వైపు మంటలు వస్తుండటంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.

New Update
తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం

Fire Incident Near Tirupati Govindaraja Swamy Temple

ఐదంతస్తుల భవనంలోని ఓ ఫ్లోర్‌లో ఫొటో ఫ్రేమ్‌ వర్క్స్‌ దుకాణం నిర్వహిస్తున్నారు. అందులో విద్యుదాఘాతంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో రూ.కోట్ల విలువైన ఫొటోలు దగ్ధమయ్యాయి. మూడు అగ్నిమాపక వాహనాల్లో సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు భవనం ముందు ఉన్న ఐదు బైక్‌లు పూర్తిగా కాలిపోయాయి. మంటలు చెలరేగడంతో ఫొటో ఫ్రేమ్‌ వర్క్స్‌ దుకాణంలో పనిచేస్తున్న సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు. భవనంలో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

నిత్యం భక్తులతో రద్దీగా ఉండే దేవాలయం సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. మూడు అంతస్తుల భవనం మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఆ ప్రాంతం భక్తులతో కిటకిటలాడడంతో చుట్టుపక్కల వారందరూ పరుగులు తీశారు.మరోవైపు ఈ భవనం పక్కనే గోవిందరాజు స్వామి ఆలయ రథం ఉంది. మంటలు రథాన్ని అంటుకుంటున్నాయి. అగ్నిప్రమాదంతో మాడ వీధుల్లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మంటలు చెలరేగడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisment
తాజా కథనాలు