Fire Accident : బంగ్లాదేశ్(Bangladesh) రాజధాని ఢాకా(Dhaka) లో గురువారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఢాకాలోని ఏడు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 44 మంది మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రి సమంత్ లాల్ సేన్, ఢాకా మెడికల్ కాలేజ్ హాస్పిటల్(Dhaka Medical College Hospital) సమీపంలోని బర్న్స్ హాస్పిటల్‌ను సందర్శించారు. ఆ తరువాత అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 43 మంది మరణించారని చెప్పారు.
సుమారు 40 మంది క్షతగాత్రులను నగరంలోని ప్రధాన ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.
ఢాకాలోని బెయిలీ రోడ్‌లోని ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్(Biryani Restaurant) లో భారీ అగ్నిప్రమాదం జరిగిందని అగ్నిమాపక దళ విభాగం అధికారి మహ్మద్ షిహాబ్ తెలిపారు. రాత్రి 9.50 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే మంటలు భవనం పై అంతస్తులకు వ్యాపించాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. రెండు గంటల తర్వాత అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, అగ్నిప్రమాదంలో 44 మంది మరణించారు, 75 మందిని భవనం నుండి సురక్షితంగా తరలించారు.
ఆరోగ్య మంత్రి సమంత్ లాల్(Samanta Lal) ప్రకారం, 33 మంది ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మరణించారు, షేక్ హసీనా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ హాస్పిటల్‌లో 10 మంది మరణించారు. చాలా మంది మృతదేహాలు బాగా కాలిపోయాయని, వారిని గుర్తించడం కష్టమని వైద్యులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
మొదటి భవనంలో మంటలు చెలరేగడంతో ప్రజలు భయంతో పై అంతస్తుల వైపు పరుగులు తీశారని స్థానికులు చెబుతున్నారు. అయితే, మంటలు పై అంతస్తులకు వ్యాపించడంతో, ప్రజలు తప్పించుకునే అవకాశం లేదు. ఆ పరిస్థితిలో చాలా మంది మరణించారు. అనంతరం అగ్నిమాపక శాఖ వాహనాలు మెట్లు ఎక్కి ప్రజలను సురక్షితంగా బయటకు తీశారు.
Also Read : శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్…బంపరాఫర్ ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ!