Fire Accident : ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆ ప్రాంతాలను చుట్టుముట్టిన రసాయన పొగ

ఏపీలోని నెల్లూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తడ మండలం మాంబట్టు పరిశ్రమలో వేస్టేజీ అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. పొగ కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

New Update
Fire Accident : ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆ ప్రాంతాలను చుట్టుముట్టిన రసాయన పొగ

Nellore : ఏపీ (Andhra Pradesh) లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా తడ మండలం మాంబట్టు పరిశ్రమలో ఉన్నట్టుండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పరిశ్రమలో వేస్టేజీ అంటుకోవడంతో సమీప ప్రాంతాలను రసాయన పొగ చుట్టుముట్టేసింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది (Fire Fighters) మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో సమీప ప్రాంతాల గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Also Read : గంజాయి బ్యాచ్ పై పోలీసుల ఉక్కుపాదం.. 8 మంది అరెస్ట్.!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు