/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/godown-jpg.webp)
విజయవాడ బందర్ రోడ్ లోని కేడీసీసీ బ్యాంకు ఎదురుగా ఉన్న మెడికల్ గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 5 అగ్నిమాపక యంత్రాలు మంటలు ఆర్పుతున్నప్పటికీ మంటలు అదుపులోకి రావడం లేదు. ఈ ప్రమాదంలో సుమారు ఐదు కోట్ల రూపాయల పైనే నష్టం వాటిలినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Also read: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు..రూ. 4లక్షల సుపారీ..!