ప్రాణాలు కాపాడుకునేందుకు తాడు సాయంతో క్యూ..!

New Update

ఢిల్లీలో అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. ముఖ‌ర్జీ న‌గ‌ర్ ప్రాంతంలోని ఓ కోచింగ్ సెంట‌ర్‌లో అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో మంట‌లు వ్యాపించాయి. ఓ కోచింగ్ సెంట‌ర్ భ‌వ‌నంలో ఈ ప్ర‌మాదం జరగగా, న‌లుగురు విద్యార్ధుల‌కు గాయాలయ్యాయి.

publive-image

దేశ రాజ‌ధానిలో అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని ముఖ‌ర్జీ న‌గ‌ర్ ప్రాంతంలోని ఓ కోచింగ్ సెంట‌ర్‌లో అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో మంట‌లు వ్యాపించాయి. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డేందుకు కోచింగ్ సెంట‌ర్ బిల్డింగ్ కిటికీల నుంచి విద్యార్ధులు తాడు సాయంతో కిందికి దూకారు. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు విద్యార్ధులు గాయ‌ప‌డ్డారు.

ఘ‌ట‌నా ప్రాంతానికి 11 అగ్నిమాప‌క యంత్రాలు చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌స్తున్నాయ‌ని అధికారులు తెలిపారు. కోచింగ్ సెంట‌ర్ నుంచి విద్యార్ధుల‌ను బ‌య‌ట‌కు ర‌ప్పించామ‌ని ఢిల్లీ ఫైర్ సేఫ్టీ చీఫ్ వెల్ల‌డించారు. కాగా, అగ్నిప్ర‌మాదానికి కార‌ణం ఏంట‌నేది ఇంకా తెలియ‌రాలేద‌ని అధికారులు తెలిపారు. ఘ‌ట‌నా స్ధ‌లంలో స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను అధికారులు వేగ‌వంతం చేశారు.

ఈ ప్రమాదం నాలుగు అంతస్తుల ఆ భవనంలో మధ్యాహ్నం 1.30 గంటలకు చోటుచేస్తుంది. భయంతో భవనంలోపై నుంచి దూకిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కిటికిల్లోంచి విద్యార్థులు దూకడం బాధకం. ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగినట్లు ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe