Telangana: పాస్‌పోర్ట్‌ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన కంప్యూటర్లు, ఫైల్స్!

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్టాఫీస్‌- పాస్‌పోర్ట్‌ సేవాకేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. కంప్యూటర్లు, ప్రింటర్లు, రూటర్లు, టేబుళ్లు తదితర సామాగ్రి పూర్తిగా కాలి బూడిదైపోయాయి. ఈ సేవాకేంద్రం సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

New Update
Telangana: పాస్‌పోర్ట్‌ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన కంప్యూటర్లు, ఫైల్స్!

Fire Accident in Kamareddy Passport Office: కామారెడ్డిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవాకేంద్రంలో శనివారం సంభవించిన ఫైర్ యాక్సిడెంట్ తో ఆఫీసులోని కంప్యూటర్లు, ప్రింటర్లు, రూటర్లు, టేబుళ్లు తదితర సామాగ్రి పూర్తిగా కాలి బూడిదైపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలు ఆర్పారు. అయితే అందులోనే పక్కనున్న పోస్టాఫీస్ కు మంటలు వ్యాపించకముందే చర్యలు చేపట్టడంతో భారీ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు.

సేవలు నిలిపివేత..
ఈ మేరకు ప్రమాదంపై స్పందించిన హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం.. కామారెడ్డి పోస్టాఫీసు (Post Office), పాస్‌పోర్టు సేవాకేంద్రం సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రంలో ఫిబ్రవరి 26 నుంచి సేవలు పొందాల్సిన దరఖాస్తుదారులకు ఎస్‌ఎంఎస్‌ రూపంలో సమాచారం చేరవేస్తామని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: India: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుకు ముహూర్తం ఫిక్స్!

అలాగే అత్యవసరం ఉన్నవారికి నిజామాబాద్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్ని చెప్పారు. 'అపాయింట్‌మెంట్లను రీషెడ్యూల్‌ చేసుకోవాలనుకునేవారు ఏ పాస్‌పోర్టు సేవాకేంద్రానికైనా లేదా పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవాకేంద్రానికైనా మార్చుకోవచ్చు' అని తెలిపారు. మరిన్ని వివరాలకోసం [email protected] ను సంప్రదించాలని సూచించారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు.

#fire-accident #kamareddy #post-office-passport-centre
Advertisment
Advertisment
తాజా కథనాలు