Fintech Companies: పేటీఎం ఎఫెక్ట్.. నిర్మలా సీతారామన్ తో ఫిన్‌టెక్ కంపెనీల సమావేశం.. పేటీఎంపై ఆర్బీఐ చర్యల ఎఫెక్ట్ తరువాత దేశంలోని మిగిలిన ఫిన్‌టెక్ కంపెనీలలో ఆందోళలన మొదలైంది. తమ ఆందోళనలు ప్రభుత్వానికి చెప్పుకోవడానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం కానున్నాయి. అటు ప్రభుత్వం కూడా వీరిలో ఆందోళన పోగెట్టే ప్రయత్నం ఈ సమావేశం ద్వారా చేయనుంది. By KVD Varma 21 Feb 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Fintech Companies: Paytm పేమెంట్ బ్యాంక్‌పై RBI కఠినంగా వ్యవహరించిన తర్వాత, ఫిన్‌టెక్ కంపెనీల సమస్యలు పెరిగాయి. Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై తీసుకున్న చర్యలకు భయపడిన ఫిన్‌టెక్ కంపెనీలు ఇప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో (Nirmala Sitharaman) సమావేశం కానున్నాయి. ఫిబ్రవరి 26న జరిగే ఈ సమావేశానికి ఆర్థిక మంత్రితో పాటు ఫిన్‌టెక్ కంపెనీల అధిపతులు హాజరుకానున్నారు. మరోవైపు ఫిన్‌టెక్ కంపెనీలకు పగ్గాలు వేసేందుకు ప్రభుత్వం కూడా ఈ సమావేశానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఫిబ్రవరి 26న సమావేశం జాతీయ మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఫిన్‌టెక్ కంపెనీల(Fintech Companies) సమావేశం ఫిబ్రవరి 26న జరగనుంది. రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌తో (Michael Patra) సహా వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అనేక ఫిన్‌టెక్ కంపెనీల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, పరిశ్రమల ప్రోత్సాహం-అంతర్గత వాణిజ్య విభాగం ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. నిజానికి పేటీఎంపై తీసుకున్న చర్యల దృష్ట్యా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఫిన్‌టెక్ కంపెనీల నిర్లక్ష్యాలను తగ్గించడానికి ప్రభుత్వం నడుం బిగిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26న జరగనున్న ఈ సమావేశం కీలకం కానుంది. సమావేశంలో కేంద్ర మంత్రి ముందు తమ ఆందోళనలను ఫిన్‌టెక్ కంపెనీల ప్రతినిధులు ఉంచుతారని చెబుతున్నారు. Also Read: మేడారం జాతర ఏ ఊరి నుంచి ఎంత దూరం, ఎంత ఛార్జ్?.. ఫుల్ లిస్ట్ ఇదే..!! ఫిన్‌టెక్ కంపెనీల్లో భయం! పేటీఎంపై ఆర్బీఐ ఉక్కుపాదం మోపినప్పటి నుంచి ఫిన్‌టెక్ కంపెనీలు ఆందోళనకు దిగడం గమనార్హం. Paytm తర్వాత కొన్ని ఇతర కంపెనీలు కూడా RBI రాడార్‌లో ఉన్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి కేసు వెలుగులోకి రానప్పటికీ, ఫిన్‌టెక్ కంపెనీలలో భయం కచ్చితంగా వ్యాపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక మంత్రితో ఫిన్‌టెక్ కంపెనీ(Fintech Companies)లు సమావేశం కానున్నాయి. ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం ఫిన్‌టెక్ కంపెనీల్లో భయాన్ని తొలగించి, ఫిన్‌టెక్ రంగానికి ఇప్పటికీ ప్రభుత్వ ప్రాధాన్యత ఉందని వారికి భరోసా ఇవ్వాల్సి ఉంటుందని కంపెనీల ప్రతినిధులు అంటున్నారు. పేటీఎంపై ఆర్బీఐ ఏం చెప్పింది? Paytm భారతదేశంలో బలమైన మార్కెట్‌ను కలిగి ఉంది. ఫిన్‌టెక్ కంపెనీల్లో Paytm టాప్ ప్లేస్ లో ఉంది. ఇది భారతదేశంలో క్యాష్ లెస్ పేమెంట్ విధానానికి కొత్త కోణాన్ని ఇచ్చింది. అయితే అనేక కారణాల వల్ల ఆర్‌బీఐ దీనిపై కఠినంగా వ్యవహరిస్తోంది. జనవరి 31న పేటీఎంపై రిజర్వ్ బ్యాంక్ కఠిన చర్యలు తీసుకుంది. బ్యాంకింగ్ సేవలు, వాలెట్, పేటీఎం ఫాస్టాగ్ వంటి ఫీచర్లను ఆర్బీఐ నిషేధించింది. KYC సంబంధిత అవకతవకల కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. గత కొన్నేళ్లుగా పేటీఎంకు నిరంతరం నోటీసులు ఇస్తున్నామని, అయితే సెంట్రల్ బ్యాంక్ నిబంధనలను కంపెనీ విస్మరిస్తూనే ఉందని ఆర్‌బీఐ చెబుతోంది. Paytm మెరుగుపరచడానికి తగినంత సమయం.. అవకాశం ఇచ్చారు. కానీ తీరు మారకపోవడంతో RBI ఈ చర్య తీసుకోవలసి వచ్చిందాని చెప్పింది. Watch this interesting Video: #nirmala-sitharaman #paytm #fintech-companies మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి