Grapes Benefits: ఏ కలర్‌ ద్రాక్ష మంచిది? ఎందులో విటమిన్లు ఎక్కువ ఉన్నాయో తెలుసుకోండి

మార్కెట్‌లో మూడు రకాల ద్రాక్షలు అందుబాటులో ఉన్నాయి. ఆకుపచ్చ, నల్ల, ఎరుపు ద్రాక్షాలలో ఆరోగ్య ప్రయోజనాల పరంగా ఎర్రద్రాక్ష ఇతర ద్రాక్ష రకాల కంటే మెరుగైనదని నిపుణులు అంటున్నారు. ద్రాక్షాల గురించి మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Grapes Benefits: ఏ కలర్‌ ద్రాక్ష మంచిది? ఎందులో విటమిన్లు ఎక్కువ ఉన్నాయో తెలుసుకోండి

Grapes Benefits: ఈ రోజుల్లో ప్రతీఒక్కరు ఆహారంపై శ్రద్ధ చూపుతున్నారు. దీనికోసం విటమిన్లు, ప్రోటీన్లు, పండ్లతో కూడిన ఆహారాన్ని తింటారు. అయితే ద్రాక్షలో ఏ ద్రాక్ష ఉత్తమని చాలామందికి తెలియదు. మనకు చాలా రకాల పండ్లు ఉన్నాయి. తినడానికి ఆకుపచ్చ, నలుపు, ఎరుపు ద్రాక్షలో ఏ ద్రాక్ష ఉత్తమని కొందరికి డౌట్ ఉంటుంది. శరీరం, ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటారు. కొంతమంది డైట్ చార్ట్ ప్రకారం అల్పాహారంలో పండ్లు, రాత్రి భోజనం చేస్తారు. అయితే ద్రాక్షలో ఏ ద్రాక్ష ఉత్తమం, ఏ ద్రాక్షలో ఎక్కువ విటమిన్లు ఉంటాయో వాటి గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ద్రాక్ష రకాలు:

మార్కెట్‌లో మూడు రకాల ద్రాక్షలు అందుబాటులో ఉన్నాయి. ఆకుపచ్చ, నల్ల, ఎరుపు ద్రాక్షాలు ఉంటాయి. అయితే ఈ మూడింటిలో ఆరోగ్య ప్రయోజనాల పరంగా ఎర్ర ద్రాక్ష ఇతర ద్రాక్ష రకాల కంటే మెరుగైనదిగా పరిగణించబడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఎర్ర ద్రాక్షలో అధిక స్థాయిలో రెస్వెరాట్రాల్, క్వెర్సెటిన్, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. వీటిని బలమైన సమ్మేళనాలు అంటారు. నిపుణుల సమాచారం ప్రకారం.. యాంటీఆక్సిడెంట్లు శరీరంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది గుండె జబ్బులు, కొన్ని క్యాన్సర్ల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

విటమిన్లు సమృద్ధి:

ఎర్ర ద్రాక్షలో విటమిన్ సి, కె పుష్కలంగా లభిస్తాయి. కొల్లాజెన్ ఏర్పడటానికి, రోగనిరోధక మద్దతు, ఎముకల ఆరోగ్యానికి ఇది అవసరం. ఎర్ర ద్రాక్ష ఎముకల ఆరోగ్యాన్ని, జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా ఎర్ర ద్రాక్ష పండ్లను తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. ఎర్ర ద్రాక్షలో ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి అనేక వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఇతర పండ్ల కంటే అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది అనేక వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

జీర్ణక్రియకు మంచిది:

  • ఎర్ర ద్రాక్షలో ఉండే పొటాషియం, ఫైబర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. ఎర్ర ద్రాక్షను క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణక్రియ సులభం అవుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.
  • కొలెస్ట్రాల్‌ను నియంత్రించే లక్షణాలు ద్రాక్షలో పుష్కలంగా ఉన్నాయి. ప్రతిరోజూ ఎర్ర ద్రాక్షను తింటే.. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. దీని వలన గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించబడతారని నిపుణులు అంటున్నారు.
  • ఎర్రద్రాక్ష తినడం వల్ల జ్ఞాపకశక్తి, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కావున ఎరుపు ద్రాక్ష తినడం ఆకుపచ్చ , నలుపు ద్రాక్ష కంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుదని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: మధుమేహ రోగులకు ఏ యాపిల్ మంచిది? నిపుణుల అభిప్రాయం ఇదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు