Phone Hack: మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో ఇలా సింపుల్‌గా తెలుసుకోండి

మొబైల్‌ని హ్యాక్ చేసినప్పుడు హ్యాకర్లు యాప్‌లు, మాల్వేర్, డేటాను ప్రాసెస్ చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు బ్యాటరీ చార్జింగ్ త్వరగా అయిపోతుంది. అంతేకాదు అప్పటి వరకు ఫాస్ట్‌గా వర్క్‌ చేసిన ఫోన్ ఒక్కసారిగా హ్యాంగ్ అవ్వడం మొదలు పెడితే జాగ్రత్త పడాలి.

Phone Hack: మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో ఇలా సింపుల్‌గా తెలుసుకోండి
New Update

Phone Hack: ప్రస్తుత కాలంలో ఫోన్‌ అనేది మనిషి జీవితంలో ఓ భాగం అయింది. దీనిని వాడకం లేకుండా ఒక్క క్షణం కూడా ఉండాలేని పరిస్థితిలో ఇప్పుడు మానవ మనుగడ ఉంది. అయితే.. టెక్నాలజీ పెరిగినప్పటి నుంచి మంచితో పాటు చెడు కూడా ఎక్కువగా జరుగుతున్న విషయాలను చూస్తూనే ఉన్నాం.చాలా మంది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అవుతున్న విషయం తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడినప్పుడు దాని పనితీరును ఖచ్చితంగా గమనించుకుంటూ ఉండాలి. లేకపోతే ఎలిపోని సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఆ సమస్యలు ఏంటో.. నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మొబైల్ హ్యాక్ అయినప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి 

అయితే..ప్రస్తుతం కాలంలో సోషల్ మీడియా అకౌంట్స్‌ని హ్యాక్ చేసినట్టుగానే.. మొబైల్స్‌ని కూడా హ్యాక్ చేస్తున్నారు కొంతమంది సైబర్ క్రిమినల్స్. అలా హ్యాక్ చేసిన ఫోన్‌లో ఉన్న డేటా ద్వారా వ్యక్తిగత, ఆర్థిక వివరాలతోపాటు బ్యాంక్ డీటేల్స్‌ని తెలుసుకుని ఈజీగా ఆర్థికంగా దెబ్బ తీసుకున్నారు. మొబైల్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలు కలెక్ట్ చేస్తుంటున్నారు. అంతేకాదు వాటిని మార్ఫింగ్ కూడా చేసే అవకాశం ఉంది. మరి అలాంటి హ్యాకర్ల నుంచి ఎలా తప్పించుకోవాలి..? మొబైల్ హ్యాక్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అంటే మనం వాడే ఫోన్ బ్యాటరీ త్వరత్వరగా చార్జింగ్ అయిపోతూ ఉంటే ఫోన్ హ్యాక్ అవుతుందనడానికి సంకేతం.దీనినిప్రతి ఒక్కరు ఖచ్చితంగా గమనించాలి.

ఇది కూడా చదవండి: తుపాన్‌లకు పేర్లు ఎవరు పెడతారు..ఎలా పెడతారు.?

మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అయినప్పుడు అనుమానం వస్తే ముందుగా మీ మొబైల్‌ని ఫార్మాట్ చేయాలి. లేదంటే ఫ్యాక్టరీ రీసెట్ అయ్యేఛాన్స్‌ ఉంటుంది. మొబైల్‌ని హ్యాక్ చేసినప్పుడు హ్యాకర్లు యాప్‌లు, మాల్వేర్, డేటాను ప్రాసెస్ చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు బ్యాటరీ చార్జింగ్ త్వరగా అయిపోతుంది. అంతేకాదు అప్పటి వరకు ఫాస్ట్‌గా వర్క్‌ చేసిన ఫోన్ ఒక్కసారిగా హ్యాంగ్ అవ్వడం మొదలు పెడితే కాస్త జాగ్రత్తలు ఉండాలి. ఇంకా ఫోన్‌లో ఉన్నకొన్ని ప్రోగ్రామ్స్ డివైస్ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేసి మొబైల్‌ స్లో అవుతుంది, మొబైల్‌లో డేటా త్వరత్వరగా అయిపోతుంది, ఇంటర్నెట్ స్పీడ్‌గా ఉన్నప్పటికీ నెట్‌ని వినియోగించడంతో కొన్ని సమస్యలు వస్తాయి.అంతేకాదు ఫోన్ ఎప్పటికప్పుడు ఆఫ్ అవుతూ దానంతట అదే రీస్టార్ట్ అవుతున్నా, ఫోన్‌లో యాప్‌లు, సెట్టింగ్స్ దానంతట అవే మారుతున్నా..!! ఫోన్‌ హ్యాకర్ ఆధీనంలో ఉందని మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటివి జరిగినప్పుడు ఫోన్ వినియోగదారులు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి కొన్నికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే హ్యాకర్ల నుంచి తప్పించుకునే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

#tips #phone-hack
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe