Financial Rules for October: అక్టోబర్ 1 నుంచి ఆర్థిక అంశాల్లో 7 మార్పులు.. వెంటనే పూర్తి చేయండి..

అక్టోబర్ నుంచి దేశంలో పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆర్థిక పరమైన నిబంధనలు మారనున్నాయి. ఈ క్రమంలో వాటిని సెప్టెంబర్ 30వ తేదీ లోగా పూర్తి చేయాల్సిందే. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Financial Rules for October: అక్టోబర్ 1 నుంచి ఆర్థిక అంశాల్లో 7 మార్పులు.. వెంటనే పూర్తి చేయండి..
New Update

Financial Rules for October: అక్టోబర్ నుంచి దేశంలో పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆర్థిక పరమైన నిబంధనలు మారనున్నాయి. ఈ క్రమంలో వాటిని సెప్టెంబర్ 30వ తేదీ లోగా పూర్తి చేయాల్సిందే. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ప్రతి ఒక్కరూ తప్పక పూర్తి చేయాల్సిన ఆ పనులు ఏంటో ఓసారి చూద్దాం. ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డ్ అన్ని పనులకు అవసరం పడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో పాటు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు అందించే పథకాలకు ఆధార్ కార్డ్ అవసరం. దాంతో సెప్టెంబర్ 30 లోపు ఆధార్ నెంబర్‌ను బ్యాంక్‌ అకౌంట్‌తో లింక్ చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఒకవేళ ఎవరైనా ఆధార్ బ్యాంక్ కార్డు లింక్ చేయకపోతే.. పిపిఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, పోస్టాఫిస్ నేషనల్ సేవింగ్స్ సర్టిపికెట్ ఖాతాలన్ని స్తంభించిపోయే అవకాశం ఉంది. అలాగే తమ ఖాతాదాల ద్వారా ఎలాంటి లావాదావేలు నిర్వహించే అవకాశం ఉండదు.

నామినేషన్ తప్పనిసరి..

ఇక స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి డీమ్యాట్ నామినేషన్ అనేది చాలా కీలకం. ఇన్వెస్టర్ మరణిస్తే ఆ డబ్బులు ఎటు పోతాయో కూడా తెలియదు. అందుకే నామినే ఉండాలి. డీమ్యాట్ అకౌంట్‌ హోల్డర్లకు ట్రేడింగ్ చేసేందుకు నామినీని ఎంచుకోవడం, లేదా తీసివేయడానికి గడువు ఈ సెప్టెంబర్ 30వ తేదీ వరకే ఉంది. ఈ మేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజెస్ ఆఫ్ ఇండియా సెబి బోర్డు స్పష్టం చేసింది. ఇలా చేయని వారి డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లను క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆ తరువాత ఆయా కంపెనీల షేర్లు అమ్మడం, కొనడం అనేది జరుగదు.

మారనున్న బీఎస్‌ఈ నిబంధన..

బీఎస్ఈ బ్యాంకెక్స్, ఫ్యూచర్, ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు ఇప్పటి వరకు శుక్రవారం వరకు ఉండేది. ఇప్పుడు కొత్త నియమం ప్రకారం బీఎస్ఈ బ్యాంకెక్స్ సోమవారానికి మార్చింది. ఈ కొత్త నిబంధన వచ్చే నెల 16వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

ఆ డాక్యూమెంట్స్ తప్పనిసరి..

ఇక అక్టోబర్ 1వ తేదీ నుంచి జనన, మరణాల నమోదు చట్టం 2023 అమల్లోకి వస్తుంది. దాంతో దేశంలో పౌరులందరూ జనన, మరణాల నమోదును ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల నుంచి పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ లిస్ట్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలన్నా జనన ధృవీకరణ పత్రం అవసరం. అందుకే కొత్త చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం సింగిల్ డాక్యూమెంట్‌ను అమల్లోకి తీసుకురాబోతోంది.

భారీగా పెరగనున్న ఛార్జీలు..

వచ్చే నెల 1వ తేదీ నుంచి విదేశీ టూర్ ప్యాకేజీ భారం కానుంది. 2023 అక్టోబర్ 1వ తరువాత రూ. 7 లక్షల కంటే ఎక్కువ ధరతో టూర ప్యాకేజీ ఉంటే 20 శాతం టీసీఎస్ భరించాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరంలో రూ. 7 లక్షల కంటే తక్కువ ధర ఉంటే టూర్ ప్యాకేజీలకు కూడా 5 శాతం టీసీఎస్ వర్తిస్తుంది. ఈ కొత్త రేట్లు.. విదేశీ ఖర్చులతో సహా అనేక రకాల ట్రాన్సాక్షన్స్ పై ప్రభావం చూపనున్నాయి.

రూ.2000 నోట్ల ఉపసంహరణ..

భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ. 2000 నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించింది. ఈ నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు ఇచ్చింది. అంటే అక్టోబర్ 1 నుంచి ఈ నోట్లు దేశంలో చెలామణిలో ఉండవు. గడువులోపు ఈ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయాలి. లేదా ఎక్స్‌చేంజ్ చేసుకోవాలి. అయితే, 2 వేల నోట్లు సెప్టెంబర్ 30 తరువాత చెల్లుబాటు కావని, ఆర్బీఐ ఏమీ ప్రకటించలేదు.

ఆన్‌లైన్ గేమ్స్‌పై జీఎస్టీ..

ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవారి జేబులకు అక్టోబర్ 1 నుంచి చిల్లు పడనుంది. 28 శాతం జీఎస్టీని విధించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే, గుర్రపు పందేలు, జూదం వంటి గేమ్స్‌పై కూడా అంతే మొత్తం జీఎస్టీ విధించనున్నారు.

Also Read:

RTV Bramhanandam Interview: రంగమార్తాండ కోసం మూడు రోజులు ఉపవాసం.. హాస్యబ్రహ్మతో స్పెషల్ ఇంటర్వ్యూ లైవ్

Earthquake Alert Service: భూకంపం వస్తే మీ ఫోన్ ముందే చెప్పేస్తుంది.. అదెలాగంటే..

#aadhaar-card #financial-rules-for-october #birth-certificate
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe