Home Loan Interest: హోమ్ లోన్ తీసుకున్నారా? మీకో గుడ్ న్యూస్.. వడ్డీరేట్లు తగ్గే ఛాన్స్! ఎందుకంటే.. 

హోమ్ లోన్స్ పై వడ్డీ రేట్లు తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది 20 శాతం వరకూ ఎక్కువగా వడ్డీ రేట్లు పెరిగాయి. ఈ ఏడాది అది తగ్గే అవకాశం ఉందని వారి అంచనా. ఆర్బీఐ రెపోరేటును తగ్గించే ఛాన్స్ ఉందనీ.. దీంతో లోన్స్ పై వడ్డీరేట్లు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. 

New Update
Home Loan Interest: హోమ్ లోన్ తీసుకున్నారా? మీకో గుడ్ న్యూస్.. వడ్డీరేట్లు తగ్గే ఛాన్స్! ఎందుకంటే.. 

Home Loan Interest: హోమ్ లోన్ తీసుకున్నవారికి, 2022-23 సంవత్సరానికి సంబంధించి వారిపై పడే EMI భారంలో ఎలాంటి తగ్గింపు దొరకలేదు.  గత రెండేళ్లలో హోమ్ లోన్ EMIలు సాధారణంగా 20% కంటే ఎక్కువ పెరిగాయి. అయితే, 2024 కొత్త ఆశను తెచ్చిపెట్టింది.  వడ్డీ రేటును 0.5% నుంచి 1.25% తగ్గించే అవకాశం ఉంది. ఈసారి వడ్డీ రేట్ల తగ్గింపు కనిపించవచ్చని సూచించే అనేక కారణాలు ఉన్నాయి. వీటి గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.

కారణం ఏమిటి?

పెరుగుతున్న ప్రపంచ ద్రవ్యోల్బణం కారణంగా, RBI మే 2022 నుంచి ఫిబ్రవరి 2023 వరకు రెపో రేటును నిరంతరం పెంచింది. దీంతో లోన్స్(Home Loan Interest)  తీసుకున్న వారంతా తమ ఈఎంఐలు  పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి ద్రవ్యోల్బణం చాలా వరకు తగ్గినప్పటికీ, సెంట్రల్ బ్యాంక్ మాత్రం వడ్డీ రేట్లను తగ్గించలేదు. అయితే, ఇప్పుడు తరువాత జరిగే  మానిటరీ కమిటీ సమావేశంలో బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు ఆర్ధిక నిపుణులు. ఇది ఆర్బీఐ రెపో రేటు తగ్గింపు నిర్ణయంగా జరుగుతుంది. 

Also Read: ఆర్బీఐ కీలక చర్యలు..ఆ ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ నిబంధన ఎత్తివేత..!

సెంట్రల్ బ్యాంక్ తన రెపో రేటును మార్చినప్పుడు, అది హోమ్ లోన్(Home Loan Interest)  తీసుకునే వారిపైనే కాకుండా వెహికల్ లోన్స్, అలాగే ఇతర రుణాలు తీసుకునే వారిపై కూడా ప్రభావం చూపుతుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 'రెపో రేటు' అనే శక్తివంతమైన సాధనాన్ని కలిగి ఉంది -ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటానికి ఇది ఒక ముఖ్యమైన మార్గం. ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, రెపో రేటును పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య ప్రవాహాన్ని తగ్గించడానికి RBI ప్రయత్నిస్తుంది. రెపో రేటు ఎక్కువగా ఉన్నప్పుడు, బ్యాంకులు RBI నుంచి పొందే లోన్స్(Home Loan Interest) ఖరీదైనవిగా మారతాయి. దీని కారణంగా బ్యాంకులు తమ ఖాతాదారులకు రుణాలను ఖరీదైనవిగా చేస్తాయి. ఇది ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహాన్ని తగ్గిస్తుంది. తగ్గిన ద్రవ్య ప్రవాహం కారణంగా, డిమాండ్ తగ్గుతుంది -ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అదేవిధంగా, ఆర్థిక వ్యవస్థ మందగించినప్పుడు, రికవరీకి డబ్బు ప్రవాహం పెరగడం అవసరం. అటువంటి పరిస్థితిలో ఆర్బీఐ రెపోరేటును తగ్గిస్తుంది. 

ఈసారి జరిగే మానిటర్ కమిటీ సమావేశంలో ఆర్బీఐ కచ్చితంగా రెపోరేటు తగ్గిస్తుందని అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు. పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయని వారంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ రెపోరేటు తగ్గిస్తే కనుక ఆ ప్రభావం అన్నిరకాల లోన్స్(Home Loan Interest) పై పడుతుంది. దీని కారణంగా హోమ్ లోన్స్ పై వడ్డీ రేట్లు తగ్గొచ్చనే అంచనాలు వేస్తున్నారు. ఇది లోన్స్ తీసుకున్న వారికీ ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు. 

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు