Kurnool: కర్నూలు జిల్లా పచ్చర్లలో ఎట్టకేలకు చిరుత బోనులో చిక్కింది. గత వారం రోజులుగా పచ్చర్ల గ్రామ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది చిరుత. రెండు రోజుల క్రితం మెహరున్నీసా అనే మహిళను చిరుత దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసింది. అంతేకాకుండా మరో ఇద్దరిపైనా కూడా దాడి చేసింది.
Also Read: ఏడో తరగతి పాఠ్యాంశంగా హీరోయిన్ తమన్నా జీవితం.. మండిపడుతున్న తల్లి దండ్రులు!
ఈ క్రమంలో హై అలర్ట్ అయిన అధికారులు నల్లమల పచ్చర్ల చెక్ పోస్ట్ వద్ద బోన్ ఏర్పాటు చేశారు. తాజాగా, చిరుత బోనులో చిక్కింది. మేకను ఎరగా వేసి బోనులో బంధించారు. చిరుత పట్టుబడటంతో గ్రామస్థులు, అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
Also Read: ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఘటనలో మృతులకు రూ.20 లక్షల పరిహారం: రామ్మోహన్ నాయుడు
అయితే, బోన్ లో చిక్కిన చిరుత, మెహరూన్ పై దాడి చేసిన చిరుత ఒక్కటేనా లేదంటే ఇంకో చిరుత ఏమోనా ఉందా అనే కోణంలో అటవీ శాఖ అధికారులు విచారిస్తున్నారు. చిరుత వయస్సు 5 నుండి 6 సంవత్సరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం చిరుత ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించారు. చిక్కిన చిరుతను తిరుపతి జూపార్క్ తరలించనున్నా అటవీ శాఖ అధికారులు.
This browser does not support the video element.