Filmfare Awards South 2024: బలగం, దసరా సినిమాలకు అవార్డుల పంట.. ఉత్తమ దర్శకుడిగా వేణు

69వ ఫిల్మ్ ఫెయిర్ అవార్డ్స్ సౌత్ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్ లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఇందులో ఉత్తమ చిత్రంగా బలగం, ఉత్తమ దర్శకుడిగా వేణు యెల్దండి, 'దసరా' సినిమాకు గానూ ఉత్తమ నటీనటులుగా నాని, కీర్తిసురేష్ లు అవార్డులు అందుకున్నారు.

New Update
Filmfare Awards South 2024: బలగం, దసరా సినిమాలకు అవార్డుల పంట.. ఉత్తమ దర్శకుడిగా వేణు

Filmfare Awards South 2024:  69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 వేడుక శనివారం హైదరాబాద్ లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో గ్రాండ్ గా జరిగాయి. ఈ అవార్డు వేడుకకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ తారలు హాజరయ్యారు. 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ లో తెలంగాణ నేపథ్యంలో రూపొందిన బలగం, దసరా సినిమాలకు అవార్డుల పంట పండింది. ఈ రెండు సినిమాలు డిఫరెంట్ కేటగిరీల్లో మొత్తం తొమ్మిది అవార్డులు సొంతం చేసుకున్నాయి. ఉత్తమ చిత్రంగా బలగం, ఉత్తమ దర్శకుడిగా వేణు యెల్దండి, 'దసరా' సినిమాకు గానూ ఉత్తమ నటీనటులుగా నాని, కీర్తిసురేష్ లు అవార్డులు అందుకున్నారు. ఇంకా ఎవరెవరికి ఏ అవార్డులు వచ్చాయో పూర్తి లిస్ట్ ఇక్కడ చూడండి.

69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 విన్నర్స్ లిస్ట్

  • బలగం: ఉత్తమ చిత్రం
  • వేణు ఎల్దండి (బలగం): ఉత్తమ దర్శకుడు
  • నాని (దసరా): ఉత్తమ నటుడు
  • కీర్తి సురేష్ (దసరా): ఉత్తమ నటి
  • ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ : శౌర్యూవ్ (హాయ్ నాన్న), శ్రీకాంత్ ఓదెల (దసరా)
  • బేబి: ఉత్తమ చిత్రం (క్రిటిక్స్)
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్): ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ), నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి)
  • బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్): వైష్ణవి చైతన్య (బేబి)
  • బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: బ్రహ్మానందం (రంగమార్తాండ), రవితేజ (వాల్తేరు వీరయ్య)
  • బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్: రూపలక్ష్మి (బలగం)
  • బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: విజయ్ బుల్గానిన్ (బేబి)
  • బెస్ట్ లిరిసిస్ట్: ఆనంత్ శ్రీరామ్ (బేబి - ఓ రెండు ప్రేమ మేఘాలిలా)
  • బెస్ట్ సింగర్: శ్రీరామచంద్ర (బేబి - ఓ రెండు ప్రేమ మేఘాలిలా)
  • ఉత్తమ గాయని: శ్వేత మోహన్ (సార్ - మాస్టారు మాస్టారు)
  • ఉత్తమ కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్ (దసరా - ధూమ్ ధామ్ దోస్తాన్)
  • బెస్ట్ సినిమాటోగ్రాఫర్: సత్యన్ సూరన్ (దసరా)
  • బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: కొల్ల అవినాష్ (దసరా)

Also Read: Friendship Day : హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే🥰.. స్నేహితుల దినోత్సవ చరిత్ర తెలుసా..? - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు