Filmfare Awards South 2024: బలగం, దసరా సినిమాలకు అవార్డుల పంట.. ఉత్తమ దర్శకుడిగా వేణు
69వ ఫిల్మ్ ఫెయిర్ అవార్డ్స్ సౌత్ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఇందులో ఉత్తమ చిత్రంగా బలగం, ఉత్తమ దర్శకుడిగా వేణు యెల్దండి, 'దసరా' సినిమాకు గానూ ఉత్తమ నటీనటులుగా నాని, కీర్తిసురేష్ లు అవార్డులు అందుకున్నారు.