AP : కర్రలతో కొట్టుకున్న అన్నదమ్ములు.. తోటి కోడళ్ళు సైతం కొప్పులు పట్టుకుని..

కోనసీమ జిల్లా ర్యాలీ గ్రామంలో అన్నదమ్ముల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇంటి సరిహద్దు విషయంలో అన్నయ్య పూవ్వల రామకృష్ణ, తమ్ముడు సత్యనారాయణ ఒకరిపై ఒకరు కర్రలతో, ఇటుకులతో దాడులు చేసుకున్నారు. తోటి కోడళ్ళు సైతం కొప్పులు పట్టుకుని కొట్లాడుకున్నారు.

New Update
AP : కర్రలతో కొట్టుకున్న అన్నదమ్ములు.. తోటి కోడళ్ళు సైతం కొప్పులు పట్టుకుని..

Fight Between Two Brothers In Konaseema : ఇంటి సరిహద్దు విషయంలో అన్నదమ్ముల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు కర్రలతో, ఇటుకులతో దాడులు చేసుకున్నారు. తోటి కోడళ్ళు సైతం కొప్పులు పట్టుకుని కొట్లాడుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా (Ambedkar Konaseema District) ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు (Brothers) ఇంటి సరిహద్దు విషయంలో కొట్లాడుకున్నారు. అన్నయ్య పూవ్వల రామకృష్ణ, తమ్ముడు సత్యనారాయణ ఒకరిపై ఒకరు కర్రలతో, ఇటుకులతో దాడులు చేసుకున్నారు. తన భర్త సత్యనారాయణను కొడుతున్నారని భార్య అడ్డుగా రాగా తనపై కూడా..అన్నయ్య రామకృష్ణ అతని కుమారుడు కర్రతో దాడులు చేశారు.

తమ్ముడు సత్యనారాయణకి తీవ్ర గాయాలు కావడంతో కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అన్నయ్య రామకృష్ణ,  తమ్ముడు సత్యనారాయణ గుణపంతో దాడికి పాల్పడ్డాడని తనకి గాయమైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరువురు అన్నదమ్ములు ఆత్రేయపురం పోలీసులకు ఒకరిపై ఒకరికి ఫిర్యాదు చేశారు.

Also Read : కార్గిల్ యుద్ధంలో ఈ 11 మంది ప్రాణత్యాగం మరిచిపోలేనిది


Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు