Sanitizers: శానిటైజర్లు...కోవిడ్ తర్వాత ఇవి మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయాయి. కోవిడ్ తగ్గినా కూడా ఇంకా చాలా మంది వీటిని వాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా డాక్టర్లు ఎక్కువగా శానిటైజర్లను వాడతారు. కానీ మీకు తెలుసా చేతులను శుభ్రం చేసుకోవడానికి వాడే ఈ శానిటైజర్లు చాలా డేంజరస్ అని. శానిటైజర్ల తయారీలో చాలా పదార్ధాలు వాడతారు. అందులో మిథనాల్ ఒకటి. అ యితే ఇప్పుడు జరిగిన స్టడీస్ ప్రకారం మిథనాల్ మానవ శరీరానికి అస్సలు మంచిది కాదు. దీని ప్రకారం మిథనాల్ కంటెంట్ ఉన్న శానిటైజర్ కూడా మానవ శరీరానికి అస్సలు మంచింది కాదు అని చెబుతోంది ఎఫ్‌డీఏ.
అంధత్వం, కోమా...
మిథనాల్ అనే పదార్ధం మానవ శరీరఆనికి చాలా చేటు చేస్తుందిన అని చెబుతోంది యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. అందుకే అక్కడ మిథనాల్ కంటెంట్ ఉన్న శానిటైజర్లను రీకాల్ చేసింది. అరుబా అలో హ్యాండ్ శానిటైజర్ జెల్, అరుబా అలో ఆల్కహాలాడ్ జెల్‌లను నిషేధించింది. మిథనాల్‌ను శరీరం మీద అప్లై చేయడం వలన చాలా ప్రమాదాలు సంభవిస్తాయని చెబుతోంది. వికారం, తలనొప్పులు, దృష్టి లోపాలు, తల తిరగడం, కిడ్నీ వైఫల్యం, కోమాలోకి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతాయి. అంతేకాదు కొన్ని సందర్భాల్లో దీని వలన ప్రాణ హాని కూడా ఉందని అంటోంది ఎఫ్డీఏ.
వెంటనే మానేయండి...
శానిటైజర్లు వాడే వారు ఇక మీదట జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది ఎఫ్డీఏ. ఇప్పటికే వాడుతున్న వాటిలో మిథనాల్ కంటెంట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలని...ఉంటే కనుక వెంటనే వాటిని పారేయాలని చెబుతోంది. మిథనాల్ చాలా తక్కువే తీసుకున్నా కూడా ప్రమాదమేనని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా పిల్లలకు ఇది చాలా ప్రమాదకారి అని చెబుతోంది. కొత్తగా కొనుక్కునే శానిటైజర్లలో మిథనాల్ ఉందో లేదో చెక్ చేసుకుని కొనుగోలు చేయాలని సూచిస్తోంది. వీలయితే మొత్తంగా శానిటైజర్లను వాడడం మానేస్తే బెటర్ అంటోంది ఎఫ్డీఏ. చేతలను సబ్బుతో శుభ్రం చేసుకోవడం అంత ఉత్తమం లేదని చెబుతోంది. ఒకవేళ శానిటైజర్లనే వాడాల్సి వస్తే మాత్రం 60శాతం ఆల్కహాల్ ఉన్న వాటిని ఉపయోగించడమే సురక్షితం అని సూచిస్తోంది.
శానిటైజర్ ఎలా వాడాలి...
శానిటైజర్ వాడకం మీద కూడా సూచనలిస్తోంది యూఎస్ ఎఫ్డీఏ. శానిటైజర్ కొనేటప్పుడు బ్రాండ్, తయారీదారు, నేషనల్ డ్రగ్ కోడ్ లాంటివన్నీ పరిశీలించాలని చెబుతోంది. దాంతో పాటూ జిడ్డుగా ఉన్న చేతులకు శానిటైజర్ ఉపయోగించకూడదని..చేతులకు రుద్దుకున్న వెంటనే శరీరంలో సున్నితమైన బాగాలకు రుద్దుకోకూడదని సూచిస్తోంది. కళ్ళకు దగ్గర అస్సలు పెట్టుకోకూడదు. అలాగే తినడానికి ముందు రెండు నిమిషాల పాటూ శానిటైజర్‌ను ఆరబెట్టుకోవాలి. పిల్లలకు ఇది దూరంగా ఉంచడమే ఉత్తమం. శానిటైజర్ రాసుకున్నాక ఎటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.