Rape Case: తప్ప తాగి.. జ్వరంతో ఉన్న కూతురిని రేప్ చేసిన దుర్మార్గుడు!

హైదరాబాద్ నగరంలో మరో లైంగిక దాడి జరిగింది. సాయినగర్ కాలనీలో ఉంటున్న ఒడిశాకు చెందిన కార్మికుడు తప్పతాగిన మైకంలో కూతురిపై దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించినట్లు పోలీసులు తెలిపారు.

New Update
Rape Case: తప్ప తాగి.. జ్వరంతో ఉన్న కూతురిని రేప్ చేసిన దుర్మార్గుడు!

Hyderabad: హైదరాబాద్ నగరంలో మరో లైంగిక దాడి జరిగింది. కని, పెంచి పెద్ద చేసిన తండ్రే తప్పతాగిన మైకంలో కూతురిపై దారుణానికి పాల్పడ్డాడు. ఈ మేరకు వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి(36) సాయినగర్ కాలనీలో ఉంటూ కార్మికుడిగా పని చేస్తున్నాడు. అయితే కొంతకాలం క్రితం అతని భార్య వదిలిపెట్టిపోయింది. దీంతో తల్లి, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే కూతురు(12)ను హాస్టల్లో చదివిస్తుండగా.. గతవారం జ్వరం రావడంతో బాలికను ఇంటికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంటికొచ్చిన తండ్రి.. ఇంట్లో తల్లి లేని సమయంలో కూతురిపై లైంగిక దాడిక పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read : క్షీణించిన ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం



Advertisment
తాజా కథనాలు