Sad news: ఏపీలో మరో దారుణం.. కట్నం కోసం కాల్చేశారా?

తండ్రీ, కూతుళ్ల మరణం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. తండ్రి, కూతురు మృతదేహాలు ఒకే చోట చూసిన స్థానికులు, కుటుంబ సభ్యులు, బంధువుల హృదయాలు కలిచివేసింది. వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈ ఘటన నరసన్నపేటలో కలకలం రేపింది.

New Update
Sad news: ఏపీలో మరో దారుణం.. కట్నం కోసం కాల్చేశారా?

తండ్రీ, కూతుళ్ల మరణం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. తండ్రి, కూతురు మృతదేహాలు ఒకే చోట చూసిన స్థానికులకు, బంధువుల హృదయాలు కలిచివేసింది. ఇద్దరు మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. కన్న కూతురు మరణాన్ని తట్టుకోలేక ఓ తండ్రి  చనిపోయిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. అల్లారు ముద్దుగా పెంచిన కూతురు మృతి చెందటంతో ఆ తండ్రి హృదయం తల్లడిల్లిపోయింది. ఎంతో ప్రేమతో గోరు ముద్దలు తినిపిస్తూ గుండెల మీద పెట్టుకొని గారాభంగా పెంచిన కూతురికి అప్పుడే నిండు నూరేళ్లు నిండిపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ తండ్రి గుండె ఒక్కసారిగా ముక్కలైంది. కన్నకూతురు లేని ఈ లోకంలో తాను కూడా బతకలేనని నిర్ణయించుకున్నాడు. కూతురు లేదన్న మనస్తాపంతో ఆ తండ్రి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కాళీ బూడిదై నవ్య డెడ్ బాడీ

శ్రీకాకుళం జిల్లాలో తండ్రీకూతుళ్ల దారుణంగా మృతి చెందారు. నరసన్నపేటలో గత మూడు రోజుల క్రితం తండ్రీకూతుళ్లు అనుమానస్పదంగా మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేటలో కూతుర్ని నవ్యను భర్త అదనపు కట్నం కోసం కొంత కాలంగా వేధింపులకు గురి చేస్తున్నారు. అయితే.. నవ్య భర్త అదనపు కట్నం కోసమే  తమ బిడ్డను చంపాడని కుటుంబ సభ్యులు ఆరోపింస్తున్నారు. నవ్యది అనుమానస్పద మృతి కాదని.. భర్త సంతోష్ చంపాడని   కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే.. ఇంట్లో కాళీ బూడిదై నవ్య డెడ్ బాడీ ఉంది. దానిని చూస్తే పలు అనుమాలు వ్యక్తం అవుతున్నాయి.

హత్య..? ఆత్మహత్య..?

కూతురి మరణం జీర్ణించుకోలేక తండ్రి కూడా మృతి చెందారా.?. నవ్య భర్త ఏమైనా హత్య చేశాడా..? అనే అనుమానులు కలుగుతున్నాయి.  సంతోష్ వల్లనే ఇద్దరి ప్రాణాలు పోయాయని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ హత్య వెనక నవ్య భర్త సంతోష్, బావ వెంకటరావు హస్తముందంటున్నారు. కావాలనే వారిని వారిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నవ్య భర్త సంతోష్, బావ వెంకట్రావులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో స్కూల్‌బస్సు బోల్తా.. ఎంత మంది విద్యార్థులకు గాయాలయ్యాయంటే..?

Advertisment
తాజా కథనాలు