ACCIDENT: ఎమ్మెల్యే లాస్య చనిపోయిన చోటే మరో దారుణం.. పల్టీలు కొట్టిన కారు! బీఆర్ఎస్ తెలంగాణ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించినచోటే మరో దారుణం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్‌చెరు వెళ్తున్న కారు కంట్రలోతప్పి పల్టీలు కొట్టడంతో ఒకరు మరణించారు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల వివరాలు తెలియాల్సివుంది. By srinivas 28 Feb 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి PATANCHERU ACCIDENT: తెలంగాణ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి మరవకముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఘోరమైన రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. మేడ్చల్ నుంచి పటాన్‌చెరు వెళ్తున్న ఓ కారు సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండ వద్ద పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టి.. మంగళవారం ఉయదం మేడ్చల్ నుంచి పటాన్‌చెరు వెళ్తున్న కారు పటాన్‌చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై అతివేగంగా డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. కారు కంట్రోల్ తప్పి రోడ్డుకు అవతలి వైపు పల్టీలుకొట్టడంతో ఒకరు అక్కడిక్కడే చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. విషయం తెలియగానే ఘటన స్థలానికి చేరకుని సహాయక చర్యలు చేపట్టినట్లు పటాన్ చెరు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో విటారా బ్రీజా కారు నుజ్జునుజ్జు అయినట్లు తెలిపారు. బాధితుల వివరాలు తెలియాల్సివుంది. అయితే రింగు రోడ్డుపై వరుస ప్రమాదాలు సంభవించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Karimnagar : ఓ వెధవ.. ఓట్ల బిచ్చగాడ.. బండిని పొట్టు పొట్టు తిట్టిన పొన్నం! ఇన్నర్ పార్ట్స్ డ్యామేజ్.. ఇక ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం మాటల్లేకుండా చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు పై ఆమె ప్రయాణిస్తున్న ఆమె కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడానికి ప్రధానంగా మూడు కారణాలు చెబుతున్నారు. మొదటిది సేఫ్టీ రేటింగ్ తక్కువ ఉన్న కారులో ప్రయాణం. లాస్య నందిత సీటు బెల్టు వేసుకోకపోవడం మరో కారణం. దీంతో ప్రమాదం జరగగానే ఆమె ముందుకు బలంగా పడిపోవడంతో తలలోని ఇన్నర్ పార్ట్స్ డ్యామేజ్ అయ్యాయి. దీంతో ఆమె అక్కడిక్కడే మరణించారు. #hyderabad #outer-ring-road #fatal-road-accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి