ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున జిల్లాలోని గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద ఓ ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. By Vijaya Nimma 08 Jul 2023 in క్రైం ఆదిలాబాద్ New Update షేర్ చేయండి జాతీయరహదారి 44 పై ఓ ఆటోనుగుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద చోటుచేసుకుంది. తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో ఆటో నాలుగు పల్టీలు కొట్టి పక్కనే ఉన్న కల్వర్ట్‌లో పడిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతులను శైలజ ( 35) పొచ్చన్న( 65), గంగు ( 50 ), సలోమీ ( 62) గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు స్వల్ప గాయాలతో బయడపడ్డారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులు మడావి ప్రేమ్‌సాగర్ , మడావి దీపక్, తేజ వర్ధన్ , ఆరాధ్య , చిన్నిలను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానకు తరలించారు. శాంతినగర్‌కు చెందిన పదిమంది ఆటోలో ఇచ్చోడ నుంచి ఆదిలాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు పోలీసులు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి