కేంద్రంపై రైతు సంఘాలు కన్నెర్ర.!

విజయవాడలో రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం నిర్వహించింది. ఈ నెల 27, 28 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్యక్రమాం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు.

New Update
కేంద్రంపై రైతు సంఘాలు కన్నెర్ర.!

విజయవాడలో రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం నిర్వహించింది. రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ 27, 28 తేదీల్లో జరిగే కార్యక్రమానికి అందరు సహకరించాలి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే దేశంలో వాస్తవాలను నిర్భయంగా చెప్పే పత్రికలపై కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు.

Also read: పవన్ కళ్యాణ్ అహంకారి..జనసేన సందీప్ సంచలన వ్యాఖ్యలు.!

పది సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం రైతులకు, కార్మికులకు చేసింది శూన్యం అని విమర్శించారు సీఐటీయూ ఉమామహేశ్వరరావు. కార్మికులు సాధించుకున్న లేబర్ కోడ్ లను రద్దు చేసే దుర్మార్గ చర్యకు మోడీ ప్రభుత్వం పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిపై ఐటీ ,ఈడీ దాడులు చేయిస్తూ..నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలను అణచివేయలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. కనీస వేతనాలు, ఈయస్ఐ, పీఎఫ్ లాంటి ఎటువంటి సౌకర్యాలు కార్మికులకు లేవని వ్యాఖ్యనించారు. దేశ సంపదను ఆదానికి అప్పజెబుతున్నారని ఆరోపించారు.

Also read: పాయల్ గట్స్ కి హాట్సాఫ్..డైరెక్టర్ ప్రశంసలు.!

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచిన తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రలేచాయని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేశు ఎద్దెవ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ విభజన హామీలు గుర్తు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇప్పుడు రాష్ట్ర విభజన హామీలు గురించి మొక్కుబడి సమీక్ష చేశారని కౌంటర్ వేశారు. కృష్ణా జలాల పునః పంపిణీ పై నోరు మెదపని ముఖ్యమంత్రి ఇప్పుడు మొక్కుబడిగా సమీక్ష చేస్తున్నారని ఎద్దెవ చేశారు. కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం జగన్మోహన్ రెడ్డి కి లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం జగన్ కు, కేంద్ర పెద్దలకు బుద్ధి చెప్పడానికి రెండు రోజుల నిరసన చేపడుతున్నట్లు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు